ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్.. వీడియో వైరల్

ప్రస్తుతం కార్తీకమాసంతో పాటు శుభమహూర్తాలు కూడా ఉన్న సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు, ఎంగేజ్మెంట్లు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితమే మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుక జరగగా.. యువ హీరో తేజ సజ్జ కూడా త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. అలాగే ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, కావ్య మారన్‌ను గ్రీస్‌లో పెళ్లి చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ అదేనా..?
అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ అదేనా..?

ప్రియా భవానీ శంకర్ సడన్ సర్‌ప్రైజ్
ఇలాంటి వార్తల నడుమ ఇరుముడి సినిమా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఒక్కసారిగా పెళ్లి చేసుకుని అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. చెన్నై నగరంలో బుధవారం ఉదయం ఈ వివాహం అత్యంత వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Priya Bhavani Shankar Marries Lover Raj Vel in Simple Ceremony Wedding Video Goes Viral

న్యూస్ యాంకర్ నుంచి హీరోయిన్‌గా పయనం
తమిళనాడుకు చెందిన ప్రియా భవానీ శంకర్ మొదట న్యూస్ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత వెండితెరకు పరిచయమై మిడ్-రేంజ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రియా భవానీ శంకర్ 'కళ్యాణం కమనీయం', 'భీమా ', 'జీబ్రా' వంటి సినిమాల్లో నటించినప్పటికీ.. ఆ సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయవంతం కాలేదు. అయితే ఈ ఏడాది ఆగస్టులో విడుదలైన 'ఇరుముడి' సినిమాతో ఆమె భారీ హిట్ కొట్టి మంచి విజయాన్ని అందుకుంది.

ఉత్తరాంధ్రను ఊపేసిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఎందులో చూడాలంటే..?
ఉత్తరాంధ్రను ఊపేసిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి.. ఎందులో చూడాలంటే..?

పదేళ్ల ప్రేమ వివాహ బంధంగా మార్పు
ప్రియా భవానీ శంకర్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ఆమె తన కాలేజీ రోజుల్లో క్లాస్‌మేట్ అయిన రాజ్ వేల్‌తో ప్రేమలో పడింది. గత పదేళ్లుగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని వారు గతంలోనే బహిరంగంగా వెల్లడించారు. ఎటువంటి హడావిడి, ఆర్భాటాలు లేకుండా అత్యంత సింపుల్ గా సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+