11 సీట్లకు పడిపోయారు: వైసీపీ ఓటమికి కారణం ఇదే- మాతో కలవండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే ఈ పార్టీ పేరును అధికారికంగా ప్రకటించారు. దీని పేరు.. పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ). జనం కోసం, జన హితం కోసం, దేశం కోసం, ధర్మం కోసం.. అనేది ప్రధానంగా ఇందులో ప్రతిబింబిస్తోంది. ఈ పార్టీ జెండాను కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. విజయవాడలో ఓ హోటల్ లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. రాజకీయాల్లో మార్పు అనేది ప్రజలే తీసుకుని రావాలని, రాష్ట్ర భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లో లేదని అన్నారు. ఏపీ రాజకీయాల్లో ఒకవైపు సెల్ఫ్ డబ్బా, మరో వైపు అవుట్రైజ్ అధికం అయ్యాయని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు అదే దిక్కయిందని అన్నారు. ప్రజలకు నిజం అనేది తెలియాల్సిన అవసరం ఉందని, ఇప్పుడా ఆ లోటే ఏపీ రాజకీయాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు.

Vijayasai Reddy slams YSRCP and invited workers and supporters to join Parivarthana Rajaneethi Party

వైఎస్ఆర్సీపీపై సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీకి 151 సీట్లు వచ్చాయని, ఆ తరువాత 11 స్థానాలకు పడిపోయారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలులోకి వచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు స్వాగతించినప్పటికీ.. అధినాయకుల అహంకారం, అహంభావాన్ని తమ ఓటుతో తిరస్కరించారని పేర్కొన్నారు. అహంభావ ధోరణితోనే వైసీపీ అగ్రనాయకత్వం ప్రజలకు దూరమైందని స్పష్టం చేశారు. ప్రశ్నించే గుణాన్ని సహించకపోవటం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ఇదే: జెండా సైతం ఆవిష్కరణ

నాయకుడు అనేవాడు ప్రజల్లోనే ఉండాలని, ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యలను వినాలని, కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాలని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను దూరం పెట్టి, చుట్టూ అడ్డుగోడలను కట్టుకున్నారని, అందువల్లే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజలకు అడ్డుగా గోడలు కట్టుకుని, ఎప్పుడైతే వారికి దూరం అయ్యారో అప్పుడే ఓటమికి బీజం పడిందని సాయిరెడ్డి చెప్పారు.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తమ చెమట, కష్టంతో పార్టీని నిలబెట్టారని, కుటుంబాలను సైతం పక్కనపెట్టి పార్టీ కోసం పని చేశారని, అందులో తాను కూడా భాగస్వామిని అయ్యానని అన్నారు. ప్రజల్లో మమేకం అయ్యే, ప్రజలతో కలిసి నడవాలనే కార్యకర్తలు లక్షమంది వైసీపీలో ఉన్నారని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ప్రజలకు సేవ చేయాలనే బలమైన అభిప్రాయం ఉంటే వెంటనే వైసీపీని వీడాలని ఆయన సూచించారు. అలాంటి వారి కోసం తమ పీఆర్పీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సాయిరెడ్డి చెప్పారు. ప్రజల కోసం పని చేసే వారికి పరివర్తన రాజనీతి పార్టీ ఎప్పటికీ స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు. అహంకార, అహంభావ పూరక రాజకీయాలు తమ పరివర్తన రాజనీతి పార్టీలో ఉండబోవని, ఇక్కడ కార్యకర్తలే అధినాయకులని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+