నా కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా అదే..అనుష్క షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్ల.. జాబితాలో అనుష్క ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. నాగార్జున నటించిన సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. లుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. అనుష్క పరిశ్రమకు వచ్చి దాదాపు 19 ఏళ్ళు అవుతుంది. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. 'కథానర్' అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.
ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అనుష్క.. తాను నటించిన చిత్రాల్లో 'వేదం' మరియు 'అరుంధతి' చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని, నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే చెత్త మూవీ 'ఒక్క మగాడు' అని.. ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించారు. 2008లో విడుదలైన ఒక్క మగాడు మూవీని వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేయగా అనుష్క శెట్టి, సిమ్రాన్, విషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.












Click it and Unblock the Notifications