''వేశ్య''గా మారిన స్టార్ హీరోయిన్
వేశ్యగా నటించాలంటే కాస్తా ధైర్యముండాలి. అది కూడా హీరోయిన్లుగా కెరీర్ ఉన్నప్పుడే ఇలాంటి పాత్రలు చేయడం సాహసమనే చెప్పాలి. గతంలో వేశ్య పాత్రల్లో నటించాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు వేశ్య పాత్రల్లో నటిస్తే చాలు ఫుల్ పాపులారిటీ. అనుష్క , ఛార్మీ, శ్రియ మొదలగు హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించినవారే. ముఖ్యంగా అనుష్క స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే వేశ్య పాత్రలో కనిపించింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ''వేదం'' సినిమాలో వేశ్యగా నటించి మెప్పించింది.
ఈ సినిమాలో అనుష్క పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అనుష్క ఇచ్చిన ధైర్యంతో శ్రియ, ఛార్మీ వంటి హీరోయిన్లు సైతం వేశ్యగా నటించారు. తాజాగా అనుష్క మరోసారి వేశ్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతుంది. అనుష్క కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్టేట్ వచ్చింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో అనుష్క హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ''ఘాతి'' అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించనున్నారు. వేదం సినిమాలో అనుష్కను వేశ్యగా చూపించిన క్రిష్ మరోసారి ఆమెను ఆ విధంగా చూపించడానికి రెడీ అవుతున్నారు. వేదం మించిన సీన్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారట దర్శకుడు. ఓ సమస్యలో చిక్కుకున్న మహిళ..దాని నుంచి ఎలా బయటపడింది అనేదే ఘాతీ కథ అని చిత్ర యూనిట్ తెలిపారు.వేదంలో గ్లామర్‌గా కనిపించిన అనుష్క ఘాతీలో ఎలా కనిపిస్తుందో అని అభిమానులు అతృతుగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications