హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు పెంపు - ధరలు ఇలా..!!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన హరి మర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిప్యూటీ సీఎంగా పవన్ పగ్గాలు చేపట్టిన తరువాత విడుదల అవుతున్న సినిమా కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా విడుదల తరువాత తొలి రెండు వారాలు ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని సినీ నిర్మాతలు కోరారు. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు టికెట్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

హరి హర వీర మల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి రెండు వారాలు టికెట్ రేట్లు పెంచాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ప్రభుత్వం తొలి పది రోజులకే టికెట్ ధరలు పెంచుతూ అవకాశం కల్పించింది. పెరిగిన ధరల మేరకు లొయర్ క్లాస్ టికెట్లను రూ.100 వరకు, అప్పర్ క్లాస్ టికెట్లను రూ.150 వరకు, మల్టీప్లెక్స్ టికెట్లను రూ.200 వరకు అనుమతి లభించింది. జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు ఒక్క టికెట్ రూ.600 + జీఎస్టీ వరకు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు.

AP govt green signal for Hari Hara veera mallu move ticket rates hike for ten days

ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లు ఇప్పటికే భారీగా సాగుతున్నాయి. వసూళ్ల పైన అభిమానులు ఇప్పటికే అంచనాల్లో మునిగి పోయారు. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ సినిమాకు టికెట్ ధరల పెంపు పైన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనే చర్చ జరిగింది.

సినిమా నిర్మాతల అభ్యర్ధన మేరకు ఏపీ ప్రభుత్వం తాజాగా టికెట్ ధరలు పెంపు పైన నిర్ణయం తీసుకుంది. ఇక, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే సినిమా నిర్మాత ఏఎం రత్నం సీఎం రేవంత్ ను కలిసి టికెట్ ధరల పెంపు కు అనుమతి ఇవ్వాలని కోరారు.

AP govt green signal for Hari Hara veera mallu move ticket rates hike for ten days

అయితే, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తరువాత బెనిఫిట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా హరి హర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు పైన ప్రభుత్వం ఇంకా నిర్ణయం వెల్లడించ లేదు.అయితే, చారిత్రాత్మక చిత్రం కావటంతో వారం రోజుల వరకు టికెట్ ధరల పెంపుకు అనుమతి వస్తుందని తెలుస్తోంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+