Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక సినిమా పాటలకు రిటైర్మెంట్ - అర్జిత్ సింగ్

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న "అర్జిత్ సింగ్" సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త పాటలు పాడబోనని ఆయన అధికారికంగా ప్రకటించారు. దాదాపు 15 ఏళ్ల సినీ సంగీత ప్రయాణానికి ముగింపు పలుకుతున్నట్లు మంగళవారం ( జనవరి 28, 2026 ) సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ అనూహ్య ప్రకటనతో అభిమానులతో పాటు సినీ పరిశ్రమ మొత్తం షాక్‌కు గురైంది.

అయితే సంగీతాన్ని పూర్తిగా వీడటం లేదని అర్జిత్ స్పష్టం చేశారు. సినిమాలకు మాత్రమే దూరమవుతున్నానని.. స్వతంత్ర సంగీత కళాకారుడిగా (ఇండిపెండెంట్ ఆర్టిస్ట్) తన ప్రయాణం కొనసాగుతుందని తెలిపారు. లైవ్ కాన్సర్ట్స్, స్వీయ సంగీత ప్రాజెక్ట్స్, కొత్త రకమైన సంగీత ప్రయోగాలపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆ పోస్టులో " అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై సినిమాల కోసం ప్లేబ్యాక్ సింగర్‌గా కొత్త అవకాశాలు స్వీకరించబోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. ఇది అద్భుతమైన, మరిచిపోలేని ప్రయాణం అని రాసుకొచ్చారు.

arjit-singh-retirement-to-singing-as-a-playback-singer-for-films-and-social-media-post-goes-viral-an

మరో పోస్ట్‌లో రిటైర్మెంట్ పై క్లారిటీ..

సంగీతాన్ని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టను.. దేవుడు నా పట్ల ఎంతో దయగా ఉన్నాడు. ఒక చిన్న కళాకారుడిగా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. స్వతంత్రంగా సంగీతాన్ని సృష్టిస్తాను. ఇప్పటికే అంగీకరించిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, వాటిని పూర్తి చేస్తాను. కాబట్టి ఈ ఏడాది కూడా నా పాటలు కొన్ని విడుదల కావచ్చని తెలిపారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను అర్జిత్ తన ప్రైవేట్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ నిర్ణయానికి ఒక్క కారణం కాదు. చాలా అంశాలు ఉన్నాయి. చాలా రోజులుగా దీని గురించి ఆలోచిస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు ఒక రకమైన విసుగు వచ్చింది. ఎదుగుదలకు కొత్త సంగీతాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అలానే తనకు కొత్తదనం ఇష్టమని.. అందుకే నా పాటలను కూడా ఎప్పుడూ ఒకేలా పాడను. లైవ్ షోలలో ట్యూన్‌లు మార్చి కొత్తగా ప్రదర్శిస్తుంటాను అని పేర్కొన్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతంపై మరింత లోతుగా దృష్టి పెట్టాలని, కొత్త తరం గాయకుల పాటలను వినాలని, వారి ప్రతిభను ప్రోత్సహించాలని తన కోరికగా అర్జిత్ తెలిపారు. "కొత్త గాయకులే ఇప్పుడు నాకు స్ఫూర్తి. వాళ్లకు అవకాశం రావాలన్నదే నా ఆశ" అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఆయన వయసు 38 సంవత్సరాలు కావడం గమనార్హం. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' చిత్రంలోని 'మాతృభూమి' పాట విడుదలైంది. అర్జిత్ సింగ్ ప్రభావం కేవలం బాలీవుడ్‌ లోనే మాత్రమే కాకుండా టాలీవుడ్‌లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. 'మనం' సినిమాలోని కనులను తాకే ఓ కల, 'స్వామి రారా'లోని అదేంటి ఒక్కసారి.. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'లోని మాయ వంటి పాటలు తెలుగు శ్రోతల మనసులను గెలుచుకున్నాయి. అలాగే బెంగాలీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, పంజాబీ భాషల్లోనూ ఆయన పాడిన పాటలు విపరీతమైన ఆదరణ పొందాయి. భావోద్వేగాలకు ప్రాణం పోసే గాయకుడిగా అర్జిత్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

arjit-singh-retirement-to-singing-as-a-playback-singer-for-films-and-social-media-post-goes-viral-an

2011లో విడుదలైన 'మర్డర్ 2' చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన అర్జిత్ సింగ్, 2013లో 'ఆషికి 2' సినిమాలోని 'తుమ్ హి హో' పాటతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రేమగీతం, విరహగీతం ఆయన స్వరంతోనే గుర్తుండిపోయింది. సినీ సంగీతానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గతేడాది కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అర్జిత్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం సంగీత ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లుగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+