"అర్జున్ రెడ్డి" మూవీ హీరోయిన్ సెగలు పుట్టిస్తుందయ్యో !!
తొలి సినిమాతోనే బూరెల బుట్టలో పడిన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది "షాలినీ పాండే". ఒకే ఒక్క చిత్రంతో ఆకాశాన్నంటిన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. Arjun Reddy సినిమాలో 'ప్రీతి' పాత్రలో ఆమె నటన చూసి ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. తొలి చిత్రానికే భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కడం అదృష్టమైతే, దానిని అంతే స్థాయిలో నటించి నిలబెట్టడం ఆమె ప్రతిభకు నిదర్శనం.
స్క్రీన్‌పై మాయ చేసిన కెమిస్ట్రీ..
Vijay Deverakonda తో కలిసి షాలినీ పాండే పోటీపడి నటించింది. ఇద్దరూ పాత్రలో పూర్తిగా లీనమై నటించడంతో స్క్రీన్‌పై వారి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. దర్శకుడు Sandeep Reddy Vanga కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారగా, షాలినీ పాండే కూడా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా గుర్తింపు పొందింది.

మధ్యప్రదేశ్ నుంచి టాలీవుడ్ వరకు
షాలినీ పాండే 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించింది. అక్కడి జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే, రెండో సంవత్సరం నుంచే నాటకాలలో పాల్గొంటూ నటనపై ఆసక్తి పెంచుకుంది. అదే ఆసక్తి ఆమెను టాలీవుడ్ వరకు తీసుకొచ్చింది. అయితే 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆమెకు మంచి గుర్తింపు వచ్చినా, అదే స్థాయి పాత్రలు మాత్రం వరుసగా దక్కలేదు. Mahanati సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది.
అలాగే 118 వంటి చిత్రాల్లో నటించింది. అలాగే 'ఇద్దరి లోకం ఒకటే', 'నిశ్శబ్దం' వంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ, తొలి సినిమా ఇచ్చిన ఇమేజ్‌ను దాటే పాత్ర మాత్రం దొరకలేదు. బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్టులు చేసినప్పటికీ అవి ఆమె కెరీర్‌కు పెద్దగా మైలురాళ్లుగా మారలేదు.

తొలి చిత్రంతోనే భారీ అంచనాలు పెరగడం ఒకవైపు వరమైతే, మరోవైపు భారంగా మారింది. 'ప్రీతి' పాత్రతో ప్రేక్షకుల మనసుల్లో ఒక స్పష్టమైన ఇమేజ్ ఏర్పడింది. దర్శక-నిర్మాతలు ఆమెను అదే తరహా పాత్రలకు మాత్రమే పరిమితం చేయాలని భావించడం వల్ల ఇతర విభిన్న పాత్రలు దక్కలేదన్న అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అందరికీ లైఫ్ ఇచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా, షాలినీ పాండేకు మాత్రం కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో దారులు తెరవలేదని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం షాలినీ పాండే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌గా ఉంటోంది. వ్యక్తిగత జీవితం, ట్రావెల్ ఫోటోలు, సినిమా అప్డేట్స్‌ను తరచూ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఫుల్ ట్రెండింగ్ గా మారాయి.












Click it and Unblock the Notifications