ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ???
భారతీయ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూశారు. 92 ఏళ్ల ఆమె ముంబైలోని Breach Candy Hospitalలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శనివారం సాయంత్రం గుండెనొప్పితో ఆసుపత్రికి తరలించిన ఆమెను ఐసీయూలో వైద్యులు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక స్వర్ణయుగం ముగిసినట్టయింది.
ఫ్యామిలీ..
1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీ ప్రాంతంలో ఆశా భోస్లే జన్మించారు. ఆమె తండ్రి ప్రముఖ సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్. ఆమె అక్క Lata Mangeshkarతో పాటు మీనా ఖాడికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్ కూడా సంగీత లోకంలో పేరు గాంచిన వారే. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని, అక్కతో కలిసి పాటలు పాడుతూ జీవన ప్రయాణాన్ని కొనసాగించింది. పూణే, కోల్హాపూర్ నుంచి చివరకు ముంబైకి చేరుకుని సంగీత ప్రపంచంలో తనకంటూ స్థానం సంపాదించింది.

ఆమె సినీ ప్రస్థానం 1943లో మరాఠీ చిత్రం 'మాఝా బాళ్'తో ప్రారంభమైంది. 1950లలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, 1952లో వచ్చిన 'సంగ్దిల్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనంతరం 'పరిణీత', 'బూట్ పాలిష్' వంటి చిత్రాలతో అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు R. D. Burmanతో కలిసి చేసిన ప్రయోగాలు ఆమె కెరీర్‌ను కొత్త దిశలో నడిపించాయి. "పియా తూ అబ్ తో ఆజా", "యే మేరా దిల్", "ఆజా ఆజా" వంటి పాటలతో వెస్ట్రన్, క్యాబరే, క్లబ్ డ్యాన్స్ నంబర్లకు కొత్త గుర్తింపును తీసుకువచ్చింది.
కాగా దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన తన గాన ప్రయాణంలో వేల సంఖ్యలో పాటలు పాడిన ఆశా భోస్లే, Guinness World Recordsలో కూడా స్థానం సంపాదించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ సహా అనేక భాషల్లో ఆమె తన స్వరాన్ని అందించారు. మెలోడీ నుంచి మాస్, ఫోక్ నుంచి వెస్ట్రన్ వరకు ఏ శైలినైనా సమర్థంగా పాడగల గాయని గా ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఆమె అక్క లతా మంగేష్కర్ తో ఆమె సంబంధాలపై కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ సమయంలోనే అక్కాచెల్లెళ్ల మధ్య అసలు గొడవ ఏంటని చర్చ నడుస్తోంది.
అసలు కారణం ఇదే..
చిన్న వయస్సులో కుటుంబానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోవడం, ఒకే రంగంలో పోటీ వాతావరణం ఉండడం వల్ల కొంతకాలం ఇద్దరి మధ్య దూరం ఏర్పడిందని అంటుంటారు. అయితే కాలక్రమేణా ఆ విభేదాలు తగ్గి, పరస్పర గౌరవంతో మళ్లీ కలిసిన సందర్భాలు ఉన్నాయి. 1984లో 'ఉత్సవ్' చిత్రంలోని "మన్ క్యోం బెహ్కా" పాట తర్వాత ఇద్దరూ కలిసి పాడకపోయినా.. తరువాతి కాలంలో మళ్లీ ఒకే వేదికపై కనిపించి అభిమానులను ఆనందపరిచారు. 2022లో Lata Mangeshkar మరణంతో మంగేష్కర్ కుటుంబం ఒక పెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు ఆశా భోస్లే మరణంతో ఆ కుటుంబం మాత్రమే కాకుండా, భారతీయ సంగీత ప్రపంచం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
-
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
మోనాలిసాకు ఊహించని షాక్: భర్తపై పోక్సో కేసు -
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు












Click it and Unblock the Notifications