Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"రేప్" చేస్తామంటూ రోజూ బెదిరిస్తున్నారు..!

బాలీవుడ్‌లో టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి "ఆయేషా ఖాన్". అందం, గ్లామర్‌తో పాటు తన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ క్రేజీ బ్యూటీగా గుర్తింపు పొందిన అయేషా ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. ఆమె మొదటగా తెలుగు ప్రేక్షకులకు Mukhachitram సినిమాతో కనిపించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు రాకపోయినా, కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా Sree Vishnu హీరోగా నటించిన Om Bheem Bush సినిమాలో చిన్న పాత్రలో కనిపించి తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అలాగే Vishwak Sen హీరోగా నటించిన Gangs of Godavari సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి మంచి గుర్తింపు సంపాదించింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అయేషా ఖాన్‌కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇటీవల బాలీవుడ్‌లో కూడా ఆమె వరుస అవకాశాలు అందుకుంటోంది. ముఖ్యంగా Ranveer Singh హీరోగా నటించిన భారీ చిత్రం Dhurandhar లో స్పెషల్ సాంగ్‌లో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాటలో తన డాన్స్ మరియు గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ayesha-khan-opens-about-abusive-comments-and-trolls-on-social-media-and-threatens

సాధారణంగా సినీ తారలకు అభిమానులు భారీ సంఖ్యలో ఉంటారు. గతంలో అభిమానులు తమ ఇష్టమైన నటీనటుల గురించి తెలుసుకోవడానికి పత్రికలు, టీవీ వంటి పరిమిత మార్గాలే ఉండేవి. అయితే ఇప్పుడు సోషల్ మీడియా రాకతో అభిమానులు నేరుగా సెలబ్రిటీలతో కమ్యూనికేట్ చేసే అవకాశం పొందుతున్నారు. ఈ దగ్గరితనం ఒకవైపు అభిమానులకు ఆనందాన్ని ఇస్తే, మరోవైపు సెలబ్రిటీలకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతోంది. కాగా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి ఆయేషా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

అయేషా ఖాన్ మాట్లాడుతూ..

చిన్ననాటి నుంచి తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఇంటర్ చదువుతున్న సమయంలో ఒక పాటలో సెకండ్ లీడ్‌గా అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే షూటింగ్‌కు ముందు తన బరువు ఎక్కువగా ఉందని చెప్పి ఆ పాట నుంచి తనను తప్పించారని, ఆ సమయంలో ఎదురైన 'బాడీ షేమింగ్' వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె పేర్కొన్నారు. ఆ మానసిక వేదన నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని చెప్పారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ ఫోటో పోస్ట్ చేయాలన్నా చాలా భయం వేస్తోందని, దుస్తులు లేదా ఫోటో ఆధారంగా వచ్చే విమర్శలను ముందుగానే ఊహిస్తూ పదిసార్లు ఆలోచించి మాత్రమే పోస్ట్ చేయాల్సి వస్తోందని ఆమె చెప్పారు. కొంతమంది సోషల్ మీడియాలో హద్దులు దాటుతూ కామెంట్స్ చేయడం వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. అంతేకాకుండా ప్రతిరోజూ తనను రేప్ చేస్తామంటూ తీవ్రమైన బెదిరింపులు కూడా వస్తున్నాయని ఆమె షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కేవలం కామెంట్స్ మాత్రమే కాకుండా వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయాలుగా మారుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సోషల్ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మహిళలను వేధించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయేషా ఖాన్ కోరారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తూ వైరల్ అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+