Ayodhya : అయోధ్య రామమందిర ఆహ్వనం అందుకున్న ఆలియా, రణబీర్..
బాలీవుడ్ స్టార్ జంట ఆలియాభట్, రణబీర్‌లకు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి బాలీవుడ్ కపుల్ ఆలియా, రణబీర్‌లకు అధికారికంగా ఆహ్వానం అందింది. ఈ స్టార్‌ను జంటను అయోధ్య వేడుకకు హాజరుకావాల్సిందిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికారికంగా ఆహ్వానం అందించింది. ఈ నెల 22న జరగబోయే ఈ మహత్తర కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియాభట్, రణబీర్‌లు కూడా భాగస్వాములు కానున్నారని ప్రొడ్యూసర్ మహావీర్ జైన్ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు.
జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే రామమందిర ప్రతిష్టాపనకు ఇప్పటికే చాలామంది ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్‌బచ్చన్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, మాధురీ దీక్షిత్ వంటి సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారితో పాటు సౌత్ సూపర్‌స్టార్స్ రజనీకాంత్‌తో పాటు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ వంటివారికి కూడా అయోధ్య ఆహ్వన పత్రికలు అందాయి. ఇప్పడు తాజాగా బాలీవుడ్ స్టార్‌కపుల్ రణబీర్ కపూర్, ఆలియాభట్‌లకు కూడా ఆహ్వానం అందింది.

యానిమల్ సినిమాతో సంచలనం సృష్టించిన రణబీర్ కపూర్ : ఇక, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్‌లో పలు సినిమాలు నటించి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక, యానిమల్ సినిమాతో మరో సంచలనాన్ని సృష్టించారు నటుడు రణబీర్‌కపూర్. యానిమల్ సినిమా ఎంతటి భారీ వసూళ్లను రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మికమందన్నా, తృప్తి డిమ్రి హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు బాలీవుడ్ స్టార్స్ అనిల్‌కపూర్, బాబీ డియోల్ వంటి వారుకూడా నటించారు.
RANBIR KAPOOR, ALIA BHATT RECEIVE INVITE FOR SHRI RAM JANMABHOOMI MANDIR CEREMONY… Shri #SunilAmbekar [Akhil Bharatiya Prachar Pramukh of #RSS], Shri #AjayMudpe [Prant Prachar Pramukh, #RSS #Konkan] and producer #MahaveerJain met #AliaBhatt and #RanbirKapoor today and invited… pic.twitter.com/Vcf7HKxIXT
— taran adarsh (@taran_adarsh) January 7, 2024
ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎంతో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచ్చేయనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఆలయం సముదాయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు ఉంటుంది. ఈ మహత్తర కార్యక్రమానికి సుమారు లక్షమంది భక్తులు హాజరుకానున్నారని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications