అందమే అసూయ పడేలా బాలయ్య కూతురు "తేజస్విని".. వీడియో వైరల్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావుతో మొదలైన ఈ ప్రస్థానం.. బాలకృష్ణ, హరికృష్ణ... ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇలా ఒక్కొక్కరిగా ఇండస్ట్రీలో తమ సత్తా చాటారు. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ కూడా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇప్పటివరకు నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలే కానీ హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వలేదు. ఎన్టీఆర్ కుమార్తెలు సినీ రంగానికి దూరంగా ఉండగా.. ఆ తర్వాత తరంలో కూడా అందరూ దూరంగానే ఉన్నారు. బాలయ్య ఇద్దరు కూతుళ్లలో ఒక్కరైనా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారేమో అని అప్పట్లో జోరుగా టాక్ నడిచింది.
కానీ బాలకృష్ణ మాత్రం ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి కూడా చేసేశాడు. పెద్ద కూతురు బ్రాహ్మణి నారా లోకేష్ తో వివాహం జరిగింది. ప్రస్తుతం నారావారి కోడలిగా, బిజినెస్ విమెన్ గా బిజీగా గడిపేస్తున్నారు. అలానే ఇక కూతురు తేజస్విని కూడా ఎంపీ భరత్ తో వివాహం చేశారు. అందం విషయంలో హీరోయిన్లు కూడా సరిపోరేమో అనే విధంగా ఉండే వీరిద్దరూ ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ తండ్రిని ఒప్పించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తేజస్విని.

బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన 'అన్ స్టాపబుల్' టాక్ షోకి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరించడమే కాదు.. అన్నీ తానై చూసుకుంది. అలానే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారింది. బాలకృష్ణ హీరోగా నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకి తేజస్విని నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 'అఖండ 2' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తన సోదరుడు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యే ప్రాజెక్ట్ నిర్మాణంలో కూడా భాగం కానున్నారని సమాచారం.
వీడియో వైరల్..
ఇక ఇప్పుడు కేవలం నిర్మాతగానే కాకుండా మొట్ట మొదటిసారి తెర ముందుకు ఎంట్రీ ఇచ్చింది తేజస్విని. ఒక జ్యూవెలరీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారడంతో నందమూరి అభిమనులతో పాటు మామూలు ఆడియన్స్ సైతం ఫుల్ ఫిదా అవుతున్నారు.
సిద్దార్థ్ ఫైన్ జ్యూవెలరీ సంబంధించిన యాడ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ యాడ్ చూస్తే తేజస్విని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారా అనేలా అనిపించకుండా అదరగొట్టారు. దాంతో తేజస్వినిని చూస్తే హీరోయిన్స్ ఏ మాత్రం సరిపోరని.. అందమే అసూయ పడేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది. మరి రానున్న రోజుల్లో హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
Nandamuri Tejaswini makes her graceful on-screen debut as the face of #SiddharthaFineJewellers#MTejeswiniNandamuri pic.twitter.com/nNBSv3BX5c
— H A N U (@HanuNews) October 31, 2025












Click it and Unblock the Notifications