బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలకు కారణం అదొక్కటేనా?
తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల లాంటి నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు వారసులుగా పరిశ్రమలో అగ్ర కథానాయకులుగా రాణిస్తున్నారు నటసింహం బాలయ్య, మన్మథుడు నాగార్జున. అయితే కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. అవి ఏ స్థాయికి చేరుకున్నాయంటే తన తండ్రికి సమకాలీనుడు, ప్రాణ స్నేహితుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు మరణిస్తే కనీసం పలకరించడానికి కూడా బాలకృష్ణ వెళ్లలేనంత. అంతగా వారిద్దరి మధ్య విభేదాలకు కారణాలేంటనేది కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకుందాం.
థియేటర్ల గొడవా?
నాగార్జున, బాలయ్య మధ్య దూరం పెరగడానికి 2012లో జరిగిన థియేటర్ల గొడవ అని చెబుతుంటారు. ఆ ఏడాది ఆగస్టులో బాలయ్య నటించిన 'శ్రీమన్నారాయణ' విడుదలైంది. అది థియేటర్లలో విజయవంతంగా నడుస్తుండగానే, వారం తిరగకముందే నాగార్జున 'షిరిడి సాయి' విడుదలైంది. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ ప్రముఖ థియేటర్ నుంచి 'శ్రీమన్నారాయణ'ను తీసేసి, నాగార్జున సినిమాను ప్రదర్శించారు. దీనిపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, అప్పటి నుండి వీరి మధ్య మాటలు లేవంటారు.

ఆడియో ఫంక్షన్ లో వ్యాఖ్యలా?
నాగచైతన్య మొదటి సినిమా 'జోష్' ఆడియో ఫంక్షన్‌కు బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ.. నాగార్జున గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నాగ్ అచ్చం నాగేశ్వరరావు గారి పోలికలతో ఉంటారు, ఆయన నాకు పక్కా కమర్షియల్ బిజినెస్ మ్యాన్‌లా కనిపిస్తారుఅని సరదాగానే అన్నప్పటికీ, ఆ మాట నాగార్జునకు నచ్చలేదని పరిశ్రమలో ప్రచారం జరిగింది. తనను నటుడిగా కంటే బిజినెస్ మ్యాన్‌గా సంబోధించడం అక్కినేని నాగార్జునను బాగా హర్ట్ చేసిందంటారు. అయితే ఆ ఒక్క మాటకే హర్ట్ అయ్యేంత మనస్తత్వం అయితే నాగార్జునకు లేదు.
మరింత దూరం పెంచింది
అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు టాలీవుడ్‌లోని అగ్ర హీరోలంతా వచ్చి నివాళులర్పించారు. బాలకృష్ణ మాత్రం వచ్చి నివాళులర్పించలేదు. దీనిపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. తన తండ్రికి అత్యంత ఆప్తుడైన ఏఎన్నార్ చివరి చూపునకు బాలయ్య రాకపోవడం అక్కినేని కుటుంబాన్ని బాగా బాధించింది. ఈ సంఘటన కూడా ఈ రెండు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచిందనే అభిప్రాయం వ్యక్తమైంది.












Click it and Unblock the Notifications