థియేటర్లు ఎలా ఇవ్వవో చూద్దాం... బాలయ్య-దిల్ రాజు మధ్య ముదురుతున్న వివాదం?

వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు విడుదల కావాల్సిన ఉన్న చిరు విశ్వంభర మే 9వ తేదీకి వాయిదా పడింది. అందుకు కారణం తన తనయుడు రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ కు పోటీ కాకూడదు అన్న ఉద్దేశంతోనే. సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తోపాటు అనిల్ రావిపూడి - వెంకటేష్ కాంబినేషన్ లో నిర్మితమవుతున్న సినిమా కూడా రాబోతోంది. ఈ రెండు సినిమాలు అధికారికంగా ప్రకటించేశాయి. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజే ఈ రెండు సినిమాలకు నిర్మాత కావడం విశేషం. కాబట్టి నైజాం ప్రాంతంలో వీటికి పుష్కలంగా థియేటర్లు దొరకబోతున్నాయి.

బాలయ్యతో సినిమా కోసం కష్టపడుతున్న దిల్ రాజు
నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను కొల్లి బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతోంది. ఇంకా పేరును ఖరారు చేయలేదు. బాలయ్యతో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారుకానీ బాలకృష్ణ ఔనని కానీ, కాదని కానీ చెప్పలేదు. అందుకు కారణం ఉంది. తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతూ విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సమయంలో దిల్ రాజు ఈ సినిమాను థియేటర్ల నుంచి హఠాత్తుగా తీసేసి వేరే సినిమాను ప్రదర్శించారు. అప్పటి నుంచి బాలయ్య దిల్ రాజును దూరం పెడుతూ వస్తున్నారు.

Balayya 109th movie is not in a situation to be allotted Dil Raju theaters in Nizam

దిల్ రాజు ఆలోచన వేరు
మారిన పరిణామాల నేపథ్యంలో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండటం, బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉండటంతోపాటు తన కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటువంటి సమయంలో బాలయ్యతో సినిమా తీస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి వస్తుందనేది దిల్ రాజు ఆలోచన. కానీ రేపు సంక్రాంతికి తన రెండు సినిమాలకు థియేటర్లను కేటాయించుకుంటే బాలయ్య సినిమాకు థియేటర్లు దొరకడం చాలా కష్టం.

అలా అని తన సొంత సినిమాలకు తగ్గించి బాలయ్య సినిమాకు దిల్ రాజు థియేటర్లు ఇచ్చే అవకాశం ఉండదు. డబ్బా థియేటర్లు ఇస్తే అభిమానులు ఒప్పుకోరు. ఇటువంటి సమయంలో బాలకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇప్పటికే వీరిద్దరి మధ్య పైకి కనపడనప్పటికీ ఉప్పు-నిప్పులా పరిస్థితి ఉంది. రేపు సంక్రాంతికి థియేటర్లు ఇవ్వకపోతే వివాదం ముదిరి మరింత పాకాన పడే అవకాశం కనపడుతోంది. అప్పుడు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+