'విశ్వంభర' మీద 'అఖండ2' ఆధిపత్యం!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. వీరి అభిమానుల మధ్య యుద్ధం మాత్రం హోరాహోరీగా జరుగుతుంది. కొన్నిసార్లు చిరు పైచేయి సాధిస్తే, మరి కొన్నిసార్లు బాలయ్య పైచేయి సాధిస్తారు. బాక్సాఫీస్ దగ్గర వీరిద్దరి మధ్య జరిగే యుద్ధం ఏ ఇద్దరు తెలుగు హీరోల మధ్య జరగదు. తాజాగా చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేశారు. ఈ సినిమా టీజర్ విడుదల చేస్తే చిరు అభిమానులు కూడా మండిపడ్డారు. అందులోని విజువల్స్, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటమే అందుకు కారణం. దీంతో అభిమానులు ఆ సినిమాపై ఆశలు వదిలేసుకున్నారు.

తమన్ బీజీఎం అదిరిపోయింది
బాలయ్య అఖండ2 చిత్రాన్ని బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో సినిమా అంటే తెలుగు సినీ ప్రేక్షకులకు పండగే. అటువంటిది భారీ విజయాన్ని అందుకున్న అఖండకు సీక్వెల్ గా వస్తున్న అఖండ2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకు వ్యాపారం కూడా భారీగా జరిగింది. శాటిలైట్ హక్కులు, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా టీజర్ విడుదలవగా అందరినీ ఆకట్టుకుంది. విజువల్స్ తోపాటు తమన్ బీజీఎం అదిరిపోయిందని చెప్పొచ్చు. దీంతో దీనిపై ఇంకా రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

Balayya s Akhanda 2 did more business than Chiranjeevi s Vishwambhara

విజయదశమికి ఆలస్యమైతే సంక్రాంతికి
అఖండ2ను విజయదశమికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కుదరకపోతే సంక్రాంతికి విడుదలవుతుంది. విశ్వంభర ఎప్పుడు విడుదలవుతుందో ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించిన గ్రాఫిక్ వర్క్ కూడా జరుగుతుందా? లేదా? అనే విషయంలో కూడా చిత్రయూనిట్ స్పష్టత ఇవ్వలేదు. యూవీ క్రియేషన్స్ రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తోంది. ఇప్పుడు చిరుకు ఉన్న మార్కెట్ ప్రకారం ఆ సినిమా కనీసం రూ.300 కోట్లు వసూలు చేస్తుందా? అనే అనుమానం అందరిలో నెలకొంది.

లాభం రావాలంటే ఇంకా ఇంకా వసూలు చేయాలి. అయితే సినీ విశ్లేషకులు కూడా విశ్వంభరపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల ఆలస్యమైతే, అఖండ2 విడుదల కూడా ఆలస్యమైతే సంక్రాంతికి అనిల్ రావిపూడి సినిమాతో చిరు వస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా, అఖండ2 పోటీపడే అవకాశం కనపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+