రోషన్ తో లవ్..?? ఓపెన్ అయిన 'కోర్ట్' మూవీ హీరోయిన్ శ్రీదేవి
కోర్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది యంగ్ హీరోయిన్ శ్రీదేవి. ఈ మూవీలో ఆమె సహజమైన నటనకు అందరి నుంచి ప్రశంసలు వచ్చాయి. దాంతో శ్రీదేవి ఆఫర్స్ ఒక్కసారిగా పెరిగాయి. కోర్ట్ మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద విజిల్స్ పడ్డాయి. అయితే ఈ క్యూట్ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు వస్తున్నారు. బ్యాండ్ మేళం చిత్రంతో ఈసారి ఫుల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల అయింది. టీజర్ 'నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా' అంటూ శ్రీదేవి చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది.
బ్యాండ్ మేళం టీజర్ చాలా సరదాగా సాగిపోయింది. రోషన్, శ్రీదేవి మధ్య కెమిస్ట్రీ కోర్టు మూవీకి మించిన ఫన్ ఉంది. దాంతో రిలీజ్ కు ముందే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలికాలంలో చిన్న సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న విషయం తెలిసిందే. కథలో కంటెంట్ ఉంటే చాలు హిట్ చేసేస్తున్నారు. దాంతో బ్యాండ్ మేళం మూవీ హిట్టు పక్కా అని తెలుస్తోంది.

అయితే కోర్ట్, బ్యాండ్ మేళం ఇలా వరుసగా రోషన్ తో జతకట్టింది శ్రీదేవి. దాంతో వీరి మధ్య లవ్ ఉన్నట్లు చాలామంది అనుకుంటున్నారు. దీనిపై ఇటీవల శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది. కోర్ట్ మూవీ కంటే ముందే తమ మధ్య పరిచయం ఉందని పేర్కొంది. ఇద్దరం చైల్డ్ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో ఐడియా లేదు.. కానీ ఫ్రెండ్స్ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్‌గా ఉంటాం. ఒరేయ్, పోరా అని కూడా పిలుచుకుంటాం.. అని తెలిపింది.
ఇక స్క్రీన్ పై మమ్మల్ని చూసి లవర్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఆ కామెంట్స్ చూసి మేము నవ్వుకుంటాం.. మేము మంచి ఫ్రెండ్స్ మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని శ్రీదేవి క్లారిటీ ఇచ్చింది. ఇక బ్యాండ్ మేళం మూవీ మార్చి 26న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ మేరకు ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది చిత్రయూనిట్.












Click it and Unblock the Notifications