బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కొత్త సినిమా

టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంటున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. 'జయ జానకి నాయక'తో కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, 'రాక్షసుడు'తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తనలోని నటుడిని నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు తన తాజా చిత్రం 'కిష్కింధపురి'తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

ఈ సినిమా విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకోవడం విశేషం. మౌత్ టాక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. మొదటి రోజు 50K టికెట్లు అమ్ముడుపోగా, రెండో రోజు ఏకంగా 75K టికెట్లు అమ్ముడయ్యాయి. ఇటీవల కాలంలో హారర్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ఈ లోటును 'కిష్కింధపురి' భర్తీ చేసిందని చెప్పాలి. కథ, కథనంలో అనవసరపు హంగులకు పోకుండా, దర్శకుడు తన పాయింట్‌ను స్పష్టంగా తెరపై ఆవిష్కరించడంలో విజయం సాధించారు.

Bellamkonda Sreenivas s Career-Best Hit Kishkindhapuri Storms the Box Office

ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు సినిమాను తన భుజాలపై మోశాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన పలికించిన నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది. తన సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి ఆయన ప్రీమియర్స్, హౌస్‌ఫుల్ షోలు వంటి అన్ని ఈవెంట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాబోయే తన సినిమాలు 'టైసన్ నాయుడు' మరియు 'హైందవ' కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వీకెండ్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ 'కిష్కింధపురి' హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+