సినిమా చూసి చచ్చిపోతే ఎవరిది సార్ బాధ్యత
టాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంటున్న యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్. 'జయ జానకి నాయక'తో కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా, 'రాక్షసుడు'తో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తనలోని నటుడిని నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు తన తాజా చిత్రం 'కిష్కింధపురి'తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
"కిష్కింధపురి" సినిమా కథ రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్) , మైథిలి (అనుపమ పరమేశ్వరన్) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. వీరు 'ఘోస్ట్ వాకింగ్ టూర్స్' అనే సంస్థలో టూర్ గైడ్స్‌గా పనిచేస్తుంటారు. పాడుబడిన భవనాలకు పర్యాటకులను తీసుకెళ్లి, దెయ్యాల గురించి కట్టుకథలు చెబుతుంటారు. అయితే, ఒకసారి వారు 35 ఏళ్ల క్రితం మూసివేసిన ఒక పాత రేడియో స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళాక వారికి నిజమైన దెయ్యం ఉందని తెలుస్తుంది. ఆ దెయ్యం కథ ఏమిటి? ఆ భవనంలో ఏం జరిగింది? ఆ దెయ్యం బారి నుండి రాఘవ్ , మైథిలి తమ పర్యాటకులను ఎలా కాపాడారు? అనేవి సినిమాలోని ప్రధాన అంశాలు.

సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు, ప్రేక్షకులను భయపెట్టే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
"రాక్షసుడు" వంటి విజయం తర్వాత వచ్చిన ఈ సినిమాలో బెల్లంకొండ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.మొదటి అర్ధభాగంలో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, సినిమా పురోగతిలో ఆమె నటన ఆకట్టుకుంది. నృత్య దర్శకుడైన సాండీ మాస్టర్ 'విశ్రవపుత్ర' పాత్రలో భయపెట్టేలా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
ప్రేక్షకుల స్పందన
"కిష్కింధపురి" సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. సోషల్ మీడియాలో కొందరు ఇది ఇటీవల కాలంలో వచ్చిన ఉత్తమ హారర్ థ్రిల్లర్‌లలో ఒకటిగా పేర్కొన్నారు. హారర్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. ఈ సినిమా తెలుగులో కొత్త తరహా కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications