మనవరాలు ఆరాధ్య నాటక ప్రదర్శనపై స్పందించిన బిగ్ బీ...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాధ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పుడూ తల్లిచేతిని పట్టుకుని కనిపించే ఆరాధ్య తన నటనతో అందరిని మెప్పించింది. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నెషనల్ స్కూల్లో శుక్రవారం జరిగిన వార్షికోత్సవ వేడుకలలో ఆరాధ్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో ఆరాధ్య ఓ పక్క ఇంగ్లీష్‌లో డైలాగ్స్ అదరగొడుతూ.. మరొపక్క తన హావాభావాలతో అందరినీ ఆశ్చర్యపరించింది.
ప్రదర్శనలో భాగంగా ఇంగ్లీష్‌లో పాటపాడుతూ స్టేజ్ పై ఆరాధ్య డాన్స్ కూడా చేసింది. ఇక, ఆరాధ్య ప్రదర్శన చూసిన ఐశ్వర్యరాయ్ ఎంతో మురిసిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇందులో ఆరాధ్య నటన చూసి నెటిజన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే, తాజాగా మనవరాలు ఆరాధ్య నాటక ప్రదర్శనపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించారు. ఆరాధ్య సహజ నటన చూసి ఆమెను మెచ్చుకుంటూ ట్వీట్ కూడా చేశారు.

ఆరాధ్య నటన ఎంతో సహజంగా ఉందన్న అమితాబ్ బచ్చన్ : ఆరాధ్య నటన ఎంతో సహజంగా ఉంది. ఆమె ప్రదర్శన పట్ల మా కుటుంబం అంతా ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ బిగ్‌బీ అమితాబ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ ట్వీట్ సోషల్‌మీడియాలో తెగ హాల్చల్ చేస్తోంది. ఇక, పెద్ద పెద్ద సెలబ్రీటీలు, ప్రముఖుల పిల్లలంతా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న సంగతి అందరికి తెలిసింది. ఈ స్కూల్ వార్షిక దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సెలబ్రిటీలంతా వచ్చారు.
అందులో అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్‌లతో సహా బాలీవుడ్‌లోని నటీనటులు వచ్చారు. తమ పిల్లల ప్రదర్శనలు చూసి ఎంతో మురిసిపోయారు. ఇదే కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ చిన్న కుమారుడు అభిరామ్ కూడా పాల్లొన్నాడు. అందులో షారుఖ్ సిగ్నెచర్ ఫోజు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య, కరీనా కపూర్ కుమారుడు తైమూర్, కరణ్ జోహార్ కవలలు యష్, రూహి సైతం నాటక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications