అహంకారం ఉంటే పాతాళానికే.. బిగ్‌బాస్ టైటిల్ అతడికే అంటున్న కౌశల్!
Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరు వారాలను పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. టాస్కులు, నామినేషన్లు, గొడవలు, గ్రూపిజం, ఎమోషన్స్‌తో హౌస్‌లో ఎప్పుడూ ఏదోక టెన్షన్ కనిపిస్తోంది. తాజాగా సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన షాలిని తిరిగి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్ల మధ్య మరోసారి గొడవలు మరోసారి మొదలయ్యాయి. హౌస్‌మేట్స్ ఆమెకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన.. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది.
గత సీజన్లతో పోలిస్తే.. ఈసారి హౌస్‌లో గొడవలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగుతారు. మాటలు హద్దులు దాటుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో బిగ్ బాస్ అభిమానుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ తనదైన శైలిలో సీజన్ 10పై కామెంట్ చేశారు.

కౌశల్ తన తాజా సోషల్ మీడియా వీడియోలో ఈ సీజన్‌ను ఏకంగా 'ది లౌడెస్ట్ సీజన్ ఆఫ్ ఆల్' అంటూ పేర్కొన్నారు. హౌస్‌లో అరుపులు, గొడవలు ఎక్కువగా ఉన్నాయంటూ కౌశల్ చేశారు. ముఖ్యంగా టైటిల్ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లకు ఆయన ఇచ్చిన సలహా ఆసక్తిని రేపుతోంది. కౌశల్ మాట్లాడుతూ.. "అరిస్తే బిగ్ బాస్ కప్పు ఇవ్వరు స్వామీ.. ఆటలో గెలిస్తేనే కప్పు ఇస్తారు" అంటూ కంటెస్టెంట్లకు చురకలు అంటించారు. తనకు ఇచ్చిన టాస్కుల్లో సత్తా చూపించడం, గేమ్‌లో నిలదొక్కుకోవడం ముఖ్యమని.. కేవలం గొంతు పెంచడం వల్ల విజేతగా నిలవలేరని అన్నారు.
అంతేకాదు.. సీజన్ ప్రారంభమై దాదాపు 45 రోజులు మాత్రమే అవుతుందనీ, ఈ సమయంలోనే విన్నర్ ఎవరు కావాలనే విషయంలో తనకు స్పష్టమైన అభిప్రాయం రావడం లేదని కౌశల్ అన్నారు. "హౌస్‌లో ఉన్న 17 మందిలో విన్నర్ ఇతను అయితే బాగుంటుంది అని చెప్పడానికి ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించడం లేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విన్నర్ రేసులో వినిపిస్తున్న పేర్లపైనే ఎక్కువ నెగిటివిటీ కనిపించడం ఈ సీజన్‌లో విచిత్ర పరిస్థితి ఉందని అన్నారు.
ఇక రోహిత్ గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి వచ్చిన రోహిత్.. తానే టైటిల్ విన్నర్ అవుతానని, ట్రోఫీ తనదేనని పలుమార్లు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నేనే బిగ్ బాస్ విన్నర్.. ట్రోఫీ నాదే.. టైటిల్ తీసుకునే వెళ్తా' అంటూ రోహిత్ కామెంట్స్ చేశారు. అయితే రోహిత్ ఇలా ముందుగానే తానే విజేత అని ప్రకటించడం పట్ల కౌశల్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను గెలుస్తానని నమ్మకం పెట్టుకోవడంలో తప్పు లేదని, కానీ ఆ స్థాయిలో గెలవడానికి తగిన గేమ్ కూడా ఉండాలని సూచించారు.
'అహంకారం కొంత వరకూ ఉండొచ్చు.. పీకల వరకూ ఉన్నా మేనేజ్ చేయొచ్చు. అదే అహంకారం నెత్తిన ఎక్కి శివతాండవం చేస్తే.. అక్కడ నుంచి కొడ్తే డైరెక్ట్‌గా పాతాళానికి వెళ్లిపోతారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక 'సగం మంది కూడా ఎలిమినేట్ కాలేదు. అప్పుడే కప్పు నాది.. నేనే టైటిల్ విన్నర్ అన్న అహంకారంతో ఇతరుల గొడవల్లో వేలు పెట్టి మొత్తం నానా రచ్చ చేస్తున్నారు' అంటూ ఆయన విమర్శించారు.
ఈ సీజన్‌లో కంటెస్టెంట్లు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నట్లు అనిపిస్తోందని కూడా కౌశల్ కామెంట్స్ చేశారు. 'వీళ్లంతా ముందే డిసైడ్ అయ్యి వచ్చారు.. అరిస్తేనే కప్పు ఇస్తారని. అరిస్తే కప్పు ఇవ్వరు స్వామీ.. గెలిస్తే కప్పు ఇస్తారు' అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనకు ఇచ్చిన టాస్కుల్లో గెలిచి, ఆ తర్వాత టైటిల్ గురించి ఆలోచించాలని సూచించారు. ఇక నరేష్ పై ప్రశంసలు కురింపించారు. హౌస్‌లో అందరూ గొడవలు, అరుపులతో కనిపిస్తున్న సమయంలో నరేష్ మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నాడని కౌశల్ అన్నారు.
'ఎప్పుడైతే అందరూ అరవడం మొదలుపెడతారో.. ఆ సీజన్‌లో ఎవరైతే కామ్‌గా ఉంటారో.. జనాల ఫోకస్ వాళ్ల మీదికి వెళ్లిపోతుంది. అది హ్యూమన్ సైకాలజీ' అని కౌశల్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నరేష్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 'నాకు తెలిసి నరేష్ వెరీ క్యూట్. కామ్‌గా తన పని తాను చేసుకుని వెళ్లిపోతున్నాడు. ఆ ఇచ్చేదేదో తనకి ఇవ్వాలి కప్పు'అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి కౌశల్ చెప్పినట్లుగా ఈ సీజన్‌లో నరేష్ సైలెంట్ గేమ్ చివరి వరకు కొనసాగుతుందా? రోహిత్ తన గేమ్ గ్రాఫ్‌ను మళ్లీ పెంచుకుంటాడా? అనేది రాబోయే వారాల్లో తేలనున్నది.

















Click it and Unblock the Notifications
