నువ్వు ఎప్పటికీ నా గుండెల్లోనే.. నటి ప్రియ ఎమోషనల్ పోస్ట్

బిగ్‌బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోలకు చెల్లెలు అన్నా.. హీరోయిన్లకు ఫ్రెండ్ అన్నా ఖచ్చితంగా దర్శక నిర్మాతలకు ప్రియనే గుర్తొచ్చేవారంటే అతిశయోక్తి కాదు. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ.. అల్లరి చేసే పాత్రలను పోషించారు ప్రియ. 90's జనరేషన్‌కు ప్రియ గురించి చెప్పాల్సిన పనిలేదు.. అయితే జెన్ జీకి బిగ్‌బాస్ ద్వారా దగ్గరయ్యారు ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నాటి నుంచి ప్రియ రేంజ్ మారిపోయింది. హౌస్‌లో ఉన్నప్పుడు తనకు యాటిట్యూడ్ ఎక్కువని, పొగరు చూపిస్తుందని చాలామంది కంటెస్టెంట్స్ ఆమెను తప్పుబట్టారు. కానీ వీటికి అప్పటికప్పుడే కౌంటర్ ఇచ్చేవారు ప్రియ. తనకు అలాంటి లక్షణాలు లేవని.. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా ఒంటరిగా ఉండటం అలవాటైందని చెప్పుకొచ్చారు. బిగ్‌బాస్‌లో ఉండగా యంగ్ జనరేషన్‌తో ఈ వయసులోనూ పోటీపడి ధీటుగా ఎదుర్కొన్నారు ప్రియ. గేమ్స్, టాస్క్‌ ఇలా ఏదైనా సరే ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారు.

Bigg Boss Fame Priya Gets Emotional Over Son Nishchay Says You Can Outgrow My Lap But Never My Heart

ప్రస్తుతం తన వయసు, ఇమేజ్ ఆధారంగా అత్త, అమ్మ, వదిన వంటి రోల్స్ వేస్తున్నారు ప్రియ. సినిమాలే కాదు సీరియల్స్‌లోనూ సత్తా చాటుతూ బిజీగా ఉంటున్నారు. అర్ధరాత్రి పూట తన ఫ్రెండ్స్‌తో కలిసి రైడింగ్‌కు వెళ్తూ చిల్ అవుతుంటారు. తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల వినాయక చవితి లడ్డూ వేలం పాట సందర్భంగా సందడి చేశారు.

50కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. నాజూకు అందాలతో ఫిగర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. అందమైన అమ్మ అంటే తనే గుర్తొచ్చే రేంజ్‌కి ఆమె ఎదిగారు. ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వుతో చలాకీగా కనిపిస్తారు ప్రియ. అయితే ఇటీవల ఆమె కాలికి గాయం కావడంతో ఇంటికే పరిమితం అయ్యారు. కాలికి పెద్ద కట్టుతో మంచంపై పడుకుని వేడి సూప్ తాగుతూ ఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకుంటున్నాను.. మీ ప్రేమను, ఆలోచలను, కూర్చొని చేసే ఆలోచనలను నాకు పంపండి. నేను తిరిగి కోలుకునే వరకు బిజీగా ఉండటానికి కొన్ని ఆలోచనలు కావాలి.. అలాగే నాకు మీ ప్రార్ధనలు కూడా కావాలని ప్రియ రాసుకొచ్చారు. దాంతో అభిమానులు, సినీ ప్రముఖులు .. మీరు త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెట్టారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియ.. తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తన కొడుకు నిశ్చయ్‌తో కలిసి బయటకు వెళ్లిన ప్రియ.. బిడ్డ గురించి రాసుకొచ్చింది. నువ్వు నా ఒడిని దాటి ఎదగొచ్చు కానీ నా హృదయాన్ని ఎప్పటికీ దాటలేవని ఎమోషనల్ అయ్యారు. గాయం నుంచి కోలుకున్నాక తిరిగి తన ప్రాజెక్ట్స్‌లో ప్రియ బిజీ అయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+