దువ్వాడ శ్రీనివాస్ గారు..ఇదే మంచి టైం మీ భార్యతో కలిసిపోండి..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9.. ఊహించని మలుపులు, రసవత్తరమైన సన్నివేశాలతో రణరంగాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొత్తగా వచ్చిన వారిలో, బిగ్‌బాస్ 2.0 తీసుకువస్తానంటూ అడుగుపెట్టిన దివ్వెల మాధురి హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయింది.

38వ రోజు ఎపిసోడ్ చూస్తే, షో పూర్తిగా మాధురి వర్సెస్ హౌస్‌మేట్స్ అన్నట్లుగా మారిపోయింది. కంటెంట్ కోసం మాధురి చేస్తున్న దూకుడు, అరుపులు, వ్యక్తిగత విమర్శలు నెక్స్ట్ లెవెల్‌కి చేరడంతో హౌస్‌మేట్స్ మరియు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Bigg Boss Telugu 9 Divvela Madhuri s Theft Allegations amp amp Overaction House Turns Madhuri vs All
ఉదయం నిద్ర లేచిన వెంటనే మాధురి సృష్టించిన రచ్చతో హౌస్‌లో యుద్ధ వాతావరణం మొదలైంది. బాత్‌రూమ్‌లో ఉన్న తన కలర్ స్టిక్కర్స్‌ని సంజన పడేశానని ఒప్పుకోవడంతో మాధురి ఆవేశంతో రెచ్చిపోయింది. ఏంటిది కామెడీనా? లేక గుడ్డు దొంగతనం చేసినట్టే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేశారా? మీకు దొంగతనం అలవాటేమో అంటూ సంజనను టార్గెట్ చేస్తూ చేసిన వ్యక్తిగత విమర్శలు శృతి మించాయి.

ఈ గొడవ ముగియకముందే, కిచెన్‌లో ఫుడ్ మానిటర్ దివ్య నిఖితతో మాధురి మరో భారీ వివాదానికి దిగింది. నిఖిత పర్మిషన్ లేకుండా ప్లేట్‌లో కర్రీ వేసుకున్నందుకు ఆమె ప్రశ్నించగా, మాధురి ఏకంగా కెప్టెన్‌తో ఫుడ్ మానిటర్‌ను మార్చాలని డిమాండ్ చేసింది.

ఈ వాదనలో మాధురి చేసిన విమర్శలు మరింత చర్చనీయాంశమయ్యాయి. నాకు అస్సలు అవసరం లేదమ్మా. మీ బాండింగ్‌లు నాకెందుకు? వాట్ ఏ జోక్.. మేం బాండింగ్స్ కోసం వచ్చామనుకున్నారా? గేమ్ కోసం వచ్చామనుకున్నారా? అంటూ అరిచిన మాధురి, అనంతరం దివ్య నిఖితను నాన్న, నాన్న అనుకుంటూ... అంటూ వెక్కిరించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారట అంటూ పక్కనే ఉన్న తనూజ వైపు చూస్తూ పరోక్షంగా బాండింగ్స్‌ను విమర్శించడం, కేవలం కంటెంట్ కోసమే మాధురి ఈ విధంగా ఆడుతోందనే విమర్శలకు బలం చేకూర్చింది.

దివ్వెల మాధురి దూకుడును హౌస్‌మేట్స్ మెంటల్ గాళ్లు అనుకుంటా.. కంటెంట్ ఇచ్చేయాలి అన్నట్లు ఉందని బహిరంగంగా విమర్శిస్తుండగా, ప్రేక్షకులు,నెటిజన్లు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మాధురిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాధురి చేస్తున్నది గేమ్ కాదు, శుద్ధ ఓవరాక్షన్. బిగ్ బాస్ 2.0 కాదు, బిగ్ బాస్ 0.2 లా ఆడుతోంది. అరుపులు, వెక్కిరింపులు తప్ప కంటెంట్ ఏముందని కొందరు విమర్శిస్తున్నారు.

ఒకే రోజు రెండు పెద్ద గొడవలు. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌ను నాశనం చేస్తున్నాయి. కేవలం బిగ్గరగా అరవడమే గేమ్ అనుకుంటే ఎలా? అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.సంజన , దివ్య నిఖితతో మాధురి చేసింది వ్యక్తిగత దూషణ. ఫుడ్ , డిసిప్లిన్ విషయంలో ఇంత అగ్రెసివ్‌గా ఉండాల్సిన అవసరం ఉందా? ఓవరాక్షన్ ఆపేయండంటూ బిగ్ బాస్‌కు నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

మరికొందరు ఏకంగా ఇదే సరైన సమయం మీ భార్య, పిల్లలతో కలిసిపోండి అంటూ దువ్వాడ శ్రీనివాస్‌కు హితవు పలుకుతున్నారు. మొత్తం మీద, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి తన ఆటతీరుతో హౌస్‌లో గ్‌బాస్ 2.0 తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నస్తోంది. అయితే, ఆమె దూకుడు , వ్యక్తిగత విమర్శలు గేమ్ కంటే డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలకు దారితీశాయి. రాబోయే రోజుల్లో ఈ వైల్డ్ కార్డ్ ఫైర్, హౌస్‌మేట్స్ , ప్రేక్షకుల నుంచి ఎలాంటి ప్రతిఘటనను ఎదుర్కొంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+