ఆ స్టార్ హీరో కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బ్రతకడం లేదు..ఆ శాపమే కారణమా..?

మురారి సినిమాలో చూపించిన విధంగా ఓ బాలీవుడ్ యాక్టర్ కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బ్రతకడం లేదు. ఇలా మూడు తరాలుగా జరుగుతూనే ఉంది.ఆ నటుడు మరెవ్వరో కాదు బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరో సంజీవ్ కుమార్.బాలీవుడ్ ప్రముఖ నటులలో సంజీవ్ కుమార్ ఒకరు. ఆయన అసలు పేరు హరిహర్ జెఠాలాల్ జరీవాలా. ఆయన 1938 జూలై 9న గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించారు.బాలీవుడ్ లో తన విలక్షణ నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటుడు సంజీవ్ కుమార్.సంజీవ్ కుమార్ తన విభిన్నమైన పాత్రలకు ప్రసిద్ధి చెందారు.

ఆయన రొమాంటిక్ , హాస్య , విలక్షణమైన పాత్రల్లో నటించారాయన.షోలే, ఆంధీ, కోషిష్, దస్తక్, ఖిలాడి, అనామిక, సీతా ఔర్ గీత, త్రిశూల్.ఖిలోనా ,యే నజ్దీకియాన్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో సంజీవ్ కుమార్ నటించారు.ఆయనకు ఉత్తమ నటుడిగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు లభించాయి. సంజీవ్ కుమార్ కేవలం నటుడే కాకుండా నిర్మాత కూడా. ఆయన అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారు.సంజీవ్ కుమార్ జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు.

Bollywood actor Sanjeev Kumar s family does not live beyond 50 years

సంజీవ్ కుమార్ హేమా మాలినితో సన్నిహితంగా మెలిగాడు. తర్వాత నటి సులక్షణ పండిట్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేశారు.సంజీవ్ కుమార్ పెళ్లికి నిరాకరించడంతో సులక్షణా పండిట్‌ అవివాహితగానే మిగిలిపోయింది. 1985 నవంబర్ 6న సంజీవ్ కుమార్ గుండెపోటుతో ముంబైలో మరణించారు.ఆయన చనిపోయే నాటికి సంజీవ్ కుమార్ వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే.సంజీవ్ కుమార్‌కి పుట్టుకతోనే గుండె సంబంధమైన లోపం ఉంది. ఇతనికి 1979లో తొలిసారి గుండెపోటు వచ్చింది.

ఆ తర్వాత 1985 నవంబర్ 6న గుండెపోటుతో మరణించాడు. విచిత్రం ఏమిటంటే సంజీవ్ కుమార్ కుటుంబంలో 50 ఏళ్లకు మించి ఎవరూ బ్రతకడం లేదు.సంజీవ్ కుమార్‌తో పాటు వాళ్ల తాత, తండ్రి, తమ్ముడు నికుల్‌తో సహా అతడి కుటుంబంలోని పురుషులందరూ 50 ఏళ్లు నిండకముందే చనిపోయారు.దీంతో ఆ కుటుంబానికి ఏదో శాపం ఉందని , అందుకే ఇలా జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+