ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో... రివ్యూవర్ అవతారం !
సాధారణంగా సినిమా రిలీజ్ సమయంలో పలు మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ప్రేక్షకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి రివ్యూలు అడుగుతూ ఉంటారు. అంతే కాకుండా సినిమాలకు రివ్యూలు కూడా ఇస్తుంటారు. కానీ ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకోవడానికి ఓ స్టార్ హీరో .. రివ్యూవర్ అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది. ముఖానికి మాస్క్ పెట్టుకొని.. థియేటర్లో నుంచి బయటికి వస్తున్న ప్రజల నుంచి సినిమా ఎలా ఉంది అంటూ స్వయంగా ప్రశ్నలు అడగడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోని ఆయన స్వయంగా పోస్ట్ చేయడంతో ఫుల్ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన గత సినిమాలు అన్నీ వరుసగా ఫ్లాపులవుతున్నాయి. సామ్రాట్ ప్రతాప, రక్షాబంధన్, సెల్ఫీ, మిషన్ రాణిగంజ్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా అక్షయ్ నటించిన హౌస్‌ఫుల్ 5 థియేటర్లలో విడుదలైంది. సీరీస్‌లో ఐదో భాగంగా వచ్చిన ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు వినోదం అందిస్తోంది.

అయితే ఈ సినిమా ప్రజలకు నచ్చిందో లేదో తెలుసుకోవడానికి అక్షయ్ కుమార్ ఏకంగా మాస్క్ వేసుకుని థియేటర్ ముందు నిలబడ్డారు. ముంబయిలోని ఓ థియేటర్ వద్ద తన సినిమా చూసిన ప్రజలను రివ్యూలు అడిగారు. అయితే ఆయనను ఎవరూ గుర్తుపట్టకపోవడం గమనార్హం. సినిమా ఎలా ఉంది?, ఎంటర్‌టైనింగ్‌గా ఉందా?, కామెడీ నచ్చిందా? అంటూ ప్రశ్నలు వేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి "దోస్తానా" ఫేమ్ తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహించారు. సాజిద్ నడియాద్వాలా ప్రొడక్షన్ బ్యానర్ పై నడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రంలో సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సౌందర్య శర్మ, జాకీ ష్రాఫ్, రితేష్ దేశ్‌ముఖ్, ఫర్దీన్ ఖాన్, సంజయ్ దత్ కూడా నటించారు. అలానే నానా పటేకర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.












Click it and Unblock the Notifications