పుష్ప-2 ఐటం సాంగ్‌ కోసం రంగంలోకి దిగిన ఇండియా నెంబర్ వన్ హీరోయిన్‌

సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్‌ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. 90 శాతానికి పైగా సినిమా పూర్తి అయినట్టు తెలుస్తోంది. తొలుత ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు.

Bollywood heroine Shraddha Kapoor will act in Pushpa-2 item song

డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే పుష్ప మొదటి భాగంలో సమంత ఐటం సాంగ్ సంగతి తెలిసిందే. ''ఊ అంటావా మామ'' అంటూ సమంత చేసిన రచ్చ అంత ఇంత కాదు. దీంతో రెండో పార్ట్‌లో ఇలాంటి ఐటం సాంగ్‌నే సుకుమార్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే ఈ పాట కోసం చాలా మంది పేర్లను అనుకున్నా, 'దేవర'తో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకున్న జాన్వీ కపూర్‌ని తీసుకుంటారనే టాక్ వినిపించింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జాన్వీ కపూర్‌ కాకుండా బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని ఈ ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం శ్రద్ధా ఏకంగా రూ.4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ పాటను అతిత్వరలో షూట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+