బాలీవుడ్ స్టార్ కపుల్ విడాకులు.. 37 ఏళ్ల కాపురంలో ఆ నటి చిచ్చు..!

సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనే పదం సర్వసాధారణం అయిపోయింది. అటు నార్త్ నుంచి సౌత్ వరకూ ఎంతో మంది సెలబ్రిటీలు తమ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి విడిపోయారు. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ కపుల్ చేరింది. పెళ్లయిన 37 ఏళ్ల తర్వాత వాళ్లిద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.

బాలీవుడ్ స్టార్ యాక్టర్ గోవింద, ఆయన సతీమణి సునితా అహుజా విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన 37 ఏళ్ల తర్వాత వాళ్లు తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం గోవింద, సునితా ప్రస్తుతం వేరువేరుగా ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అటు గోవిందగానీ, ఇటు సునితా గానీ స్పందించడం లేదు. కొన్ని మనస్పర్థల కారణంగా వారు విడిగా ఉంటున్నట్లు సమాచారం అందుతున్నా.. ఓ ఫేమస్ మరాఠీ నటి వాళ్ల చక్కని కాపురంలో చిచ్చు పెట్టిందని.. గత కొన్నాళ్లుగా గోవింద.. ఆ నటితో సన్నిహితంగా ఉంటూ వస్తున్నట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే ఆ నటి పేరు మాత్రం బయటకు రావడం లేదు.

Bollywood Star Govinda and Sunita Ahuja Reportedly Part Ways After 37 Years of Marriage

చెరొక ఇంట్లో ఉంటున్నాం..

అయితే ఇటీవల హిందీ రష్ అనే మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి వైవాహిక జీవితంపై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. " మేమిద్దరం చెరొక ఇంట్లో ఉంటున్నాం. గోవింద మీటింగ్స్, పార్టీస్ అని లేట్ నైట్ వస్తుంటారు. అందుకే ఆయన సెపరేట్ బంగ్లాలో ఉంటున్నారు. నేను పిల్లలతో వేరే బంగ్లాలో ఉంటున్నా. వచ్చే జన్మలో నువు నా భర్తగా వద్దూ అని ఫన్నీగా గోవిందతో చెప్తుంటా.

మేమిద్దరం కలిసి బయటకు వెళ్లి సినిమా చూసిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. ఆయన ఎప్పుడూ పని అని తిరుగుతుంటారు. " అని సునితా వెల్లడించారు. అయితే గోవింద ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. వాళ్లు ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా ఉన్నారని భావిస్తున్నారు. ఈ విషయం వారికి మింగుడుపడడం లేదు.

గోవింద, సునితా మార్చి 1987లో వివాహం చేసుకున్నారు. వారికి ఓ బాబు, కూతురు ఉన్నారు. కుమార్తె టీనా 1988లో జన్మించగా.. కుమారుడు యశ్వర్ధన్ 1997లో జన్మించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+