ఉడుపి స్టైల్ "మిరియాల రసం".. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ డబుల్..!

మిరియాల రసం పాతకాలం నాటి వంట. సాధారణంగా వేడి వేడి అన్నంలోకి రసం, చారు, సాంబార్ వంటివి తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి నోటికి ఏమి తిన్నా అంత రుచికరంగా అనిపించదు. అలాంటి వారి కోసమే ఈ మిరియాల రసం.. ఈ ఉడిపి స్టైల్ మిరియాల రసం.. చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాక దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ.. ఇంట్లోని పదార్థాలతోనే రుచికరమైన మిరియాల రసం తయారు చేసుకోవచ్చు. మరి మిరియాల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

మిరియాల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజంత, మిరియాలు ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి నాలుగు రెబ్బలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర తగినంత, ఎండుమిర్చి రెండు, ఆవాలు అర టేబుల్ స్పూన్, నూనె లేదా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

PepperRasam Recipe Easy Udupi-Style recipe Check Required Ingredients amp amp Quick Step-by-Step Guide

ఇప్పుడు మిరియాల రసం తయారీ విధానం చూస్తే.. ముందుగా చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసుకోవాలి. ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపి ముద్దగా నూరుకోవాలి. ఇప్పుడు చింతపండు నీటిలో ఉప్పు, పసుపు వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత మసాలా ముద్ద వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ తర్వాత తాలింపును రసంలో వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి.. ఈ మిరియాల రసాన్ని వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+