బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి రెస్టారెంట్‌లో చోరీ..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి రెస్టారెంట్‌లో చోరీ జరిగింది. ముంబైలోని దాదర్ వెస్ట్ లో కోహినూర్ స్క్వేర్ 48వ అంతస్తులో ఉన్న ఆమె రెస్టారెంట్లో అక్టోబర్ 27వ తేదీన ఓ లగ్జరీ కారు చోరికి గురైంది. ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాస్టియన్ పేరుతో నటి శిల్పాశెట్టి రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు. అందులో ఒకటే దాదర్‌లోని కోహినూర్ స్క్వేర్ లో ఉంది. బేస్‌మెంట్ పార్కింగ్‌లో ఉన్న బీఎండబ్ల్యూ జెడ్ 4 కారును ఎవరో దొంగిలించారు. ఈ కారు సుమారు రూ. 90లక్షలకుపైనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది టూ సీటర్ కారు. ఈ కారును బిల్డింగ్ పార్కింగ్ ఏరియా నుంచి దొంగిలించినట్లు సమాచారం.
బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ కు అక్టోబర్ 27వ తేదిన రుహాన్ ఫిరోజ్ ఖాన్ అనే ఓ 34 ఏళ్ల వ్యాపారవేత్త ఇద్దరు స్నేహితులతో కలసి వచ్చాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అతను వచ్చి తన బీఎండబ్ల్యూ జెడ్ 4 కారును రెస్టారెంట్ వాలెట్ పార్కింగ్ ఉద్యోగికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, రెస్టారెంట్ నుంచి పార్కింగ్ ఏరియాకు వచ్చి చూస్తే ఆ కారు కనిపించకుండా పోయింది. అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ఒకసారి పరిశీలించగా, ఆ కారును రెండు గంటల సమయంలో ఎవరో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు తేలింది.

శిల్పాశెట్టిపై ఫైర్ అయిన ఓనర్..
తన లగ్జరీ కారు చోరీ గురయిన వెంటనే ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. అక్కడి శివాజీ పార్క్ పోలీసుస్టేషన్‌లో కారు ఓనర్ ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 303 (2) దొంగతనం కేసు కింద ఈ కేసును నమోదు చేసినట్లు తెలుస్తోంది. అధికారులు వెంటనే దర్యాప్తు ప్రక్రియ వేగవంతం చేశారు. నటి శిల్పా శెట్టికి చెందిన రెస్టారెంట్ భద్రతా చర్యలపై కార్ ఓనర్ తీవ్రంగా మండిపడ్డాడు.
భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరాడు. అయితే, ఇంత జరిగినా, ఇంకా శిల్పా శెట్టి ఈ విషయంపై ఏమాత్రం స్పందించలేదని కారు ఓనర్ ఆమెను తప్పుబట్టారు. శిల్పాశెట్టి రెస్టారెంట్ కు ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటులూ తరచుగా వస్తుంటారు. అలాంటి రెస్టారెంట్ నుంచి ఓ లగ్జరీ కారు చోరీకి గురి కావడం అందరినీ షాక్ కు గురి చేస్తోంది.












Click it and Unblock the Notifications