సాయి పల్లవిపై పోలీస్ కేసు నమోదు..?
తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సాయి పల్లవికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆమెకు పెద్ద తలనొప్పులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ఓ వెబ్‌సైట్ ద్వారా పనిచేయకుండానే నెలకు 30 - 50 వేలు తన అకౌంట్లో పడిపోతున్నాయి అనే విధంగా పరొక్షంగా మాట్లాడరట. అయితే ఇది కాంట్రవర్సీ అవుతుందని భావించిన యాజమాన్యం ఈ వీడియోను ఎడిట్ చేశారు. కానీ ఇంటర్వ్యూ చేసిన టీమ్‌లోని ఒక సభ్యుడు ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు . ఈ వార్తను సదరు ఛానెల్ టెలికాస్ట్ చేయకుండా ఆపేసినందుకుగాను వాళ్లపై కూడా యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు . ఏకంగా ఓ నేషనల్ న్యూస్ పేపర్‌లో కూడా ఈ న్యూస్ హల్‌చల్ అవుతుంది.అయితే ఇందులో ఎంత వరకూ వాస్తవం ఉందో తెలియదు కానీ..దీనికి సంబంధించిన వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications