షారుక్ ఖాన్, దీపికా పదుకొనెలపై చీటింగ్ కేసు..!
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెలపై చీటింగ్ కేసు నమోదైంది. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి చేశారు. ప్రముఖ కారు కంపెనీ హ్యుందాయ్ తరఫున వీరిద్దరూ చేసిన ప్రకటన కారణంగానే ఇలా చే చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగిందంటే..?
రాజస్థాన్ భరత్‌పూర్ జిల్లా నివాసి కీర్తి సింగ్.. షారుక్, దీపికా కలిసి నటించిన హ్యుందాయ్ కార్ల ప్రకటన చూసి సుమారు రూ.24 లక్షల విలువైన హ్యుందాయ్ అల్కాజార్ కారును కొనుగోలు చేశానని తెలిపారు. యితే, కారు కొనుగోలు చేసిన ఆరు నెలల్లోనే ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని కోర్టులో పేర్కొన్నారు. వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ నుండి పెద్ద శబ్దాలు వినిపించాయని.. కారు ఒక్కోసారి రోడ్డు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి కూడా వచ్చిందన్నారు. షోరూం సిబ్బందిని సంప్రదించినా, వారు "మోడల్‌లోనే డిజైన్ సమస్యలు ఉన్నాయి, దాన్ని సరిచేయడం సాధ్యం కాదు" అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో వివరించారు.

ఈ మేరకు మొదట కీర్తి సింగ్ ఫిర్యాదు చేసినప్పటికీ, నిపుణుల రిపోర్టుల ప్రకారం కారులో పెద్ద లోపాలు లేవని పోలీసులు చెబుతూ కేసు నమోదు చేయలేదని సమాచారం. దాంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా భరత్‌పూర్‌లోని సీజేఎం కోర్టు కేసును విచారించింది. షారుక్, దీపికా హ్యుందాయ్ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటన చేశారని, వినియోగదారుడి నష్టానికి వీరిరువురూ కూడా బాధ్యత వహించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధుర్‌గేట్ పోలీసులు షారుక్ ఖాన్, దీపికా పదుకొనెలతో పాటు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఆరుగురు సిబ్బందిపై IPC 420 (చీటింగ్) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
షారుక్ ఖాన్ 1998 నుండి హ్యుందాయ్ బ్రాండ్‌తో అనుబంధం కొనసాగిస్తున్నారు. దీపికా పదుకొనె 2023లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. వీరిద్దరూ కలిసి గతేడాది ఒక ప్రమోషనల్ యాడ్‌లో నటించారు. ఒక ప్రకటనలో కారుపై అత్యధిక ప్రశంసలు కురిపిస్తూ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. దాంతో కస్టమర్లు నమ్మి మోసపోయారని ఆరోపణలు ఉన్నాయి.
వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రముఖులు ప్రకటనల్లో నటిస్తే లేదా ఉత్పత్తులపై తప్పుడు ప్రచారం చేస్తే, కేవలం కంపెనీలు మాత్రమే కాదు - ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కూడా బాధ్యత వహించాల్సిందేనని స్పష్టంచేసింది. అదే తీర్పును ఆధారంగా చేసుకొని కోర్టు ఈ కేసును నమోదు చేయమని పోలీసులకు ఆదేశించింది.
ఈ ఘటన బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా వ్యాపార, ప్రకటన రంగాల్లో కూడా పెద్ద చర్చనీయాంశమైంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రమోషన్లలో జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి తిరిగి జరగవచ్చని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.
-
రెహ్మాన్ డకైత్ వర్సెస్ మేజర్ ఇక్బాల్.. అసలైన విలన్ ఎవరు? -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications