ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ప్రముఖ నటితో పాటు 8 మంది అరెస్ట్..!
సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో సినీ నటి అంజు కృష్ణను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటుగా తమిళ కో డైరెక్టర్ విన్సీ నివేత సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు చెన్నై వేదికగా సాగుతున్న మాదక ద్రవ్యాల నెట్ వర్క్ ను యాంటీ నార్కొటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజాగా ఛేదించింది. దాంతో ఈ డ్రగ్స్ వ్యవహారం ప్రస్తుతం చిత్ర సీమలో సంచలనంగా మారింది.
చెన్నై డ్రగ్స్ కేసులో కోలీవుడ్ కు చెందిన సినీ నటి అంజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని వలసరవాక్కంలో యాంటీ-నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ నిర్వహించిన దాడుల్లో అంజు కృష్ణతో పాటు మరో 8 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారంలో అరెస్ట్ అయిన వారిలో అంజు కృష్ణ , విన్సీ నివేత, కార్తిక్ రాజు, యశ్వంత్ , శ్రీరామ్, అల్విబిన్షా, వెంకటేష్ కుమార్ ఉన్నారు. ఇక వీరందరినీ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో ప్రస్తుతం వీరందరూ జైలులో ఉన్నారు.
ఇక ఈ దాడుల్లో భాగంగా భారీ మొత్తంలో సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీటిలో 6 గ్రాముల మెతాంఫేటమైన్ (మెత్), 7 గ్రాముల OG గంజాయి, 15 గ్రాముల సాధారణ గంజాయి , LSD స్టాంపులు, స్మోకింగ్ బాంగ్స్ పట్టుకున్నారు. అలాగే నిందితుల నుంచి 9 మొబైల్ ఫోన్లు, ఒక కారును సీజ్ చేశారు.

కేరళకు చెందిన అంజు కృష్ణ మలయాళం, తమిళ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఆరో సినిమాతో ఆమె నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మలయాళంలో సుమేష్ అండ్ రమేష్, ఆకాశం కడన్ తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది.












Click it and Unblock the Notifications