స్టార్ హీరోని చేసిన దర్శకుడిని దారుణంగా అవమానించిన చిరంజీవి..?
తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చర్చించుకోవాలంటే ఎన్టీఆర్, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిలను గుర్తు చేసుకోవాలి. తొలితరం హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉండగా, తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు.ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి. బాలకృష్ణ, నాగార్జున , వెంకటేష్ వంటి సినీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలను తట్టుకుని చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
అయితే చిరంజీవికి ఇప్పుడు ఇంత పేరు, స్టార్‌డమ్ వచ్చి ఉండవచ్చు కానీ, కెరీర్ స్టార్టింగ్‌లో మాత్రం పెద్ద దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు.హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే. అయితే ఓ దర్శకుడు మాత్రం ధైర్యం చేసి చిరంజీవితో సినిమా చేశారు. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు కోదండరామిరెడ్డి.ఈయన పేరు ఈతరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ 1990ల్లో కోదండరామిరెడ్డి ఆగ్ర దర్శకుడు.

ఆయన డైరెక్ట్ చేసిన 94 సినిమాల్లో దాదాపు 80 సినిమాలు సూపర్‌హిట్ సాధించి అతడిని దిగ్గజ దర్శకుడిగా నిలిపాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన 'న్యాయం కావాలి' సినిమాతోనే చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు.తర్వాత చిరు, కోదండరామిరెడ్డి కలిసి 'కిరాయి రౌడీలు' సినిమా తీసి హిట్టు కొట్టారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఖైదీ చిత్రంతోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు.
ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, గూండా, దొంగ, విజేత, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, కొండవీటి దొంగ, ముఠామేస్త్రి ఇలా వీళ్ల కాంబినేషన్‌లో టోటల్‌గా 23 సినిమాలు వచ్చాయి. చిరంజీవికి మెజార్టీ హిట్లు కోదండరామిరెడ్డి దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే ఓ సందర్భంలో చిరంజీవి తన ఎదుగుదలకు కారణమైన దర్శకలు గురించి చర్చించారు. తనతో ఒక్క సినిమా తీసిన వారి పేర్లు కూడా చిరు ప్రస్తావించారు.
కానీ ఈ కోదండరామిరెడ్డి గురించి గురించి ఆయన ఒక్కమాట కూడా చెప్పలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు.చిరంజీవికి స్టార్ హీరో అయ్యాడంటే అది కోదండరామిరెడ్డి సినిమాలతోనే ..అలాంటిది అతను గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో చిరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై రియాక్ట్ అయిన కోదండరామిరెడ్డి చిరంజీవి మాటలకు తనని చాలా బాధపడ్డానని ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications