"మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు"ను పిలవలేదా, రాలేదా..?
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఈ వెలుగుల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి వేడుకలు టాలీవుడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెగాస్టార్ ఇంట జరిగిన ఈ సంబరాలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై సందడి చేశారు. చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అతిథులను ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఈ వేడుకల పిక్స్‌ను చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో అభిమానులు మురిసిపోతున్నారు.

చిరంజీవి నివాసంలో జరిగిన ఈ దీపావళి వేడుకలకు టాలీవుడ్‌లోని అగ్ర తారలు హాజరయ్యారు. ముఖ్యంగా..నాగార్జున ,విక్టరీ వెంకటేష్ ,లేడీ సూపర్ స్టార్ నయనతార వీరంతా మెగాస్టార్ ఇంట సందడి చేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు ఇలా ఒకచోట కలిసి దీపావళి జరుపుకోవడం భలేగా ఉందంటూ నెటిజన్లు ఫన్నీగా, సంతోషంగా కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రియమైన వారి రాకతో దీపావళి మరింత శోభను తీసుకొచ్చిందని, తాము ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశామని చిరంజీవి ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు.
అసెంబ్లీ మాటలు మనసులో ఉన్నాయా? బాలయ్య మిస్సింగ్ పై హాట్ టాపిక్
ఈ దీపావళి వేడుకల్లో ఒక ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌కు నాలుగు పిల్లర్లుగా చెప్పుకునే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఒకే చోట కలిసి కనిపించినా, నందమూరి హీరో బాలకృష్ణ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.
ఇటీవలే అసెంబ్లీ వేదికగా చిరంజీవిపై బాలకృష్ణ చేసిన విమర్శలు ఇంకా మర్చిపోకముందే ఈ వేడుక జరగడం గమనార్హం. అసలు మెగాస్టార్ ఇంట జరిగిన ఈ దీపావళి వేడుకలకు బాలకృష్ణకు ఆహ్వానం అందిందా లేదా? ఒకవేళ ఆహ్వానం అందినా ఆయన వెళ్లలేదా? ఆహ్వానం అందకపోవడానికి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలే కారణమా? అనే చర్చ ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్రంగా సాగుతోంది.
మొత్తానికి, "మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు" అని గతంలో చెప్పిన బాలకృష్ణ... చిరంజీవి ఇంట జరిగిన దీపావళి వేడుకలకు దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేడుకలు సినీ అభిమానులకు కనుల పండుగగా ఉన్నప్పటికీ, ఈ నలుగురు అగ్ర హీరోలు కలిసి కనిపించకపోవడం మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications