ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్న చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. త్రిష కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానరుపై దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. గ్రాఫిక్స్ నాణ్యంగా లేవనే ఉద్దేశంతో విడుదల ఆలస్యమవుతోంది. గ్రాఫిక్స్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేయాలని యోచిస్తున్నారు. ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. రెండురోజుల క్రితమే విజయవాడలో మంత్రి నారాయణ కూతురు రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణలో పాల్గొని చంద్రబాబును కొనియాడారు.
ఈ సినిమా కథ ముందుగా చిరు దగ్గరకే వచ్చింది
సినీ పరిశ్రమలో ఒక హీరోను దృష్టిలో ఉంచుకొని రచయితలు, దర్శకులు కథలు రాసుకుంటారు. తీరా హీరో దగ్గరకు వెళ్లిన తర్వాత ఆయనకు నచ్చకపోవచ్చు. లేదంటే డేట్లు ఖాళీ లేకపోవడం, మరికొన్ని ఇతర కారణాలవల్ల సినిమా చేయడం కుదరదు. దీంతో వేరే హీరోకు కథ వినిపిస్తారు. ఆ హీరోకు నచ్చిన వెంటనే సినిమా పట్టాలెక్కుతుంది. ఈ కోవలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై ఎస్.గోపాల్ రెడ్డి నిర్మించిన మంగమ్మగారి మనవడు సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాతో స్టార్ హీరోగా ఒక్కసారిగా దూసుకుపోయారు. అయితే దర్శకుడు, నిర్మాత ముందుగా ఈ కథను చిరంజీవికి వినిపించారు.

సన్నిహితుల దగ్గర చిరు బాధపడుతుంటారు
చిరంజీవికి కథ నచ్చకపోవడంతో తిరస్కరించారు. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈరోజు వరకు చిరంజీవి చాలా సందర్భాల్లో తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంగమ్మగారి మనవడు సినిమా చేయలేకపోయినందుకు ఎంతో బాధగా ఉందంటూ చెబుతుంటారు. అలా గొప్ప సినిమాను మిస్ చేసుకున్నారు. తర్వాత భార్గవ్ ఆర్ట్స్ సంస్థ అంటే బాలయ్య సొంత నిర్మాణ సంస్థలా మారిపోయింది. ఆ బ్యానరుపై ఈ సినిమా తర్వాత ముద్దుల కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మామయ్య, ముద్దుల మేనల్లుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రూపొందాయి.












Click it and Unblock the Notifications