ఒకేరోజు నాలుగు సినిమాలు రిలీజ్.. ఏది హిట్టు..? ఏది ఫట్టు..?
క్రిస్మస్, న్యూ ఇయర్ కానుకగా ఇవాళ(డిసెంబర్ 25) ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు అన్నీ ఒక్కోటి ఒక్కో జోనర్ కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ముందుగా ఛాంపియన్ సినిమా విషయానికి వస్తే.. ఛాంపియన్ మూవీని తెలంగాణ జలియన్ వాలాబాగ్ గా చెప్పుకునే సిద్దిపేట జిల్లా బైరాన్‌పల్లి యథార్థ సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. తెరకెక్కించారు. ఈ రియల్ స్టోరీకి ఫుట్ బాల్ అంశాన్ని జోడించి తీశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. రోషన్ నటన, కథలోని బలమైన డ్రామా, సెకండాఫ్, క్లైమాక్స్ .. అలాగే మ్యూజిక్ అద్భుతంగా ఉన్నట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.
ఈ మూవీలో రోషన్ సరసన మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీకి ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించారు. డైరెక్టర్ గా ప్రదీప్ కు ఇది తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే హిట్ కొట్టారు. ఈ మూవీని వైజయంతీ మూవీస్ తెరకెక్కించింది.
క్రిస్మస్ కానుకగా రిలీజైన మరో ఆసక్తికర మూవీ శంబాల. ఆది సాయికుమార్ హీరోగా నటించారు. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఓ మిస్టికల్ విలేజ్ లో ఆకాశం నుంచి ఉల్క పడుతుంది. ఆ రోజు నుంచి ఊరిలో అనుకోని సంఘటనలు, హత్యలు జరుగుతుంటాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు హీరో చేసే సాహసాలే ఈ మూవీ. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. స్టోరీ మొత్తం గ్రిప్పింగ్ గా సాగుతుంది. మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. కానీ క్లైమాక్స్ కొంత నిరాశ పరిచినట్లు చెబుతున్నారు. మొత్తానికి డైరెక్టర్ యుగంధర్ ముని తొలి సినిమాతోనే ఓ పెద్ద ప్రయత్నమే చేశారు. ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు.
ఇక క్రిస్మస్ కానుకగా హీరో శివాజీ నటించిన దండోరా మూవీ సైతం రిలీజైంది. పక్కా పల్లె బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. ఈ మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. కుల వివక్ష నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తెలంగాణలోని ఓ పల్లెలో జరుగుతుంది. సమాజంలోని వివక్ష, అసమానతలను వివరించారు. శివాజీ, నవదీప్ నటన సినిమాకు హైలెట్ గా చెప్పొచ్చు. కథ, మ్యూజిక్, డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఇక ఇదే రోజు హారర్ మూవీ ఈషా కూడా రిలీజైంది. ఈ మూవీని శ్రీనివాస్ మన్నె తెరకెక్కించారు. ఈ మూవీలో త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. దెయ్యాలు ఉన్నాయా.. లేవా.. అనే కోణంలో సినిమా సాగుతుంది. సెకండాఫ్ లో హారర్ మూమెంట్స్, క్లైమాక్స్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే సినిమా అక్కడక్కడే భయపెడుతుందని టాక్ వినిపిస్తోంది.
-
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
మరో సూపర్ కాన్సెప్ట్‌తో వస్తున్న యంగ్ హీరో..థియేటర్లలో రచ్చే..! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్‌లో ఆనంద క్షణాలు -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications