అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసింది అందుకే: సీఎం రేవంత్‌రెడ్డి
డిసెంబరు నాలుగోతేదీ రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప2 బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ కూడా వచ్చారు. ఆయనతోపాటు పుష్ప2 యూనిట్ కు చెందినవారు 12 మంది, ఆయన బౌన్సర్లు, పీఏలు, మేనేజర్లు ఉన్నారు. అల్లు అర్జున్ ను చూసేందుకు అభిమానులంతా ఎగబడటంతో ఒక్కసారిగా థియేటర్ లో తొక్కిసలాట జరిగి రేవతి అనే 35 సంవత్సరాల మహిళ మృతిచెందగా, ఆమె తొమ్మిదేళ్ళ కుమారుడు ఆరోజు నుంచి నేటివరకు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి గురించి వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రహోదగ్రులయ్యారు.
ముఖ్యమంత్రిని ప్రశ్నించిన ఆంగ్ల మీడియా
అసెంబ్లీలో దీనిపై రేవంత్ మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్న బాలుడిని పరామర్శించేందుకు సినీ పరిశ్రమ నుంచి ఒక్క పురుగు కూడా వెళ్లలేదని, మానవత్వం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ఆరోజు నుంచి కొత్త సినిమాలకు తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేశారు. తర్వాత పరిశ్రమ పెద్దలంతా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. తాజాగా సీఎం రేవంత్ దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నారు. అక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులతో కలిసి పాల్గొంటూ కంపెనీలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంగ్ల మీడియా అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. దానికి ఆయన బదులిచ్చారు.

చట్టం తన పని తాను చేసుకుపోయింది
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వస్తారని, అందుకు అనుమతి కావాలంటూ సంఘటన జరగానికి రెండురోజుల ముందే పోలీసులను సంప్రదించగా వారు అనుమతిచ్చేందుకు నిరాకరించారు. పోలీసులు వద్దని చెప్పినప్పటికీ వినకుండా అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారు. ఆయన రావడంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలో రావడం.. బన్నీ సెక్యూరిటీ సిబ్బంది వారిని తోసేయడం.. అది తొక్కిసలాటకు దారితీయడం జరిగింది. ఘటనలో ఒక మహిళ మృతిచెందింది. ఒక మనిషి మరణించడంలో ఆయన ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోవచ్చుకానీ, ఆమె చనిపోతే 12 రోజుల వరకు ఎవరూ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ విషయం చట్టం తన పని తాను చేసుకుపోయింది అని రేవంత్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications