చిరంజీవిని సమావేశానికి రావొద్దని చెప్పింది రేవంత్‌రెడ్డే!!
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో తెలంగాణ ప్రభుత్వం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రనటులు, రాఘవేంద్రరావు, సురేష్ బాబు, దిల్ రాజు, కొరటాల శివ.. తదితర ప్రముఖులంతా హాజరయ్యారు. అంతర్జాతీయస్థాయి సినిమాల షూటింగ్ లు కూడా హైదరాబాద్ లోనే జరిగేలా ఆ స్థాయిలో తీర్చిదిద్దుదామని, అందుకు కలిసి పనిచేద్దామని ప్రభుత్వం, పరిశ్రమ తీర్మానించాయి. అయితే ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవలేదు. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సమావేశానికి రావాల్సిన అవసరం లేదని స్వయంగా రేవంత్ రెడ్డే చిరంజీవికి చెప్పినట్లు తెలుస్తోంది.
చిరంజీవికి ఇలా చేయాలని చెబితే బాగోదని..
సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్వయంగా తన సొంత డబ్బునే ఖర్చు చేసే చిరంజీవిని సమావేశంలో ఇలా చెయ్యి.. అలా చేస్తే బాగుంటుంది.. మీరంతా ఇలా ఉండాలి.. అంటూ ప్రభుత్వం తరఫున చిరంజీవికి కూడా సూచనలివ్వడం అంటే ఆయన మర్యాదకు భంగం వాటిల్లినట్లేనని రేవంత్ రెడ్డి భావించారు. అంతేకాకుండా టికెట్ ధరల విషయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి వెళ్లి కలిస్తే ఆయన నమస్కారం చేసినా తిరిగి ప్రతి నమస్కారం చేయకపోవడంతోపాటు ఆ ఫొటోలను, వీడియోలను బయటకు విడుదల చేయించింది వైసీపీ ప్రభుత్వం. అరుదైన గౌరవం కలిగివున్న చిరంజీవి ఈ సమావేశానికి రాకుండా ఉండటమే ఉత్తమం అని సీఎం భావించారు.

చిరంజీవి మర్యాదకు భంగం వాటిల్లకూడదు
సమావేశంలో మనందరం ఇలా చేద్దాం.. అలా చేద్దాం అంటూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులందరికీ చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయినప్పటికీ చిరంజీవి గొప్ప ఇమేజ్ కలిగిన వ్యక్తి అని, కరోనా సమయంలో కూడా తన సొంత డబ్బుతో కార్మికులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, సామాన్యులకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడం, బ్లడ్ బ్యాంకు ద్వారా రక్తం పంపించడం లాంటివి చేశారు. చిరు సోదరుడు పవన్ కల్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలుండాలన్నా, చిరంజీవి మర్యాదను కాపాడాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని అమలు చేశారు. ఈ విషయంపై నెటిజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications