టాలీవుడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..టికెట్ల పెంపు, స్పెషల్ షోలు రద్దు..?
నూతనంగా ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు తెలుగు సినీ పరిశ్రమ స్పందన లేకపోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాన్ని, సూచనలను అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను ముఖ్యమంత్రి కోరారు. అయితే.. దీనిపై ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమ స్పందించలేదు.
ఈ క్రమంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మౌనంగా ఉండడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో సినీ పెద్దల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్ షోల కోసం ప్రభుత్వం దగ్గరకు వచ్చే హీరోలతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ ప్రకటన (యాడ్) చేయించాలని సినీ ఇండస్ట్రీకి సూచించారు. దీనిపై అధికారులకు కూడా ఆయన కీలక ఆదేశారు జారీ చేశారు.

ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి అన్ని రకాలుగా మద్దతుగా ఉంటోందని , అదే విధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తాము ఈ డ్రగ్స్‌ను అరికట్టడానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. హీరోల చేత డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అయితే దీనిపై సినీ ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఎవరూ స్పందించలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు వ్యవహారించిన తీరు సరిగా లేదని ఆయన అభిప్రాయడ్డారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద హీరోల సినిమా టికెట్ల పెంపు, స్పెషల్ షోలు రద్దు చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఏ ఒక్క హీరో కూడా స్పందికపోవడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో వారాంతంలో యువత డ్రగ్స్‌కు బానిసవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వాడకంపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఎన్ని చర్యలు తీసుకుంటున్న డ్రగ్స్, గంజాయిని పలు కొత్త దారుల్లో నగరానికి తీసుకువస్తున్నారు. పోలీసుల కళ్లు గప్పి యువతకు, వ్యాపారస్తులకు డ్రగ్స్ చేరవేస్తున్నారు. తాజాగా సైబరాబాద్‌లో పోలీసులు చేపట్టిన తనీఖిల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లతో పాటు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ కేసులో డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్‌సింగ్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications