'ది ప్యారడైజ్' విడుదలపై కుట్ర? కోర్టును ఆశ్రయించిన నిర్మాతలు!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజుల ముందు ఈ చిత్రంపై సోషల్ మీడియాలో విపరీతమైన దుష్ప్రచారం జరుగుతోందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థ బెంగళూరు అదనపు నగర సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించగా.. సెప్టెంబర్ 19న కోర్టు కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులపై తాత్కాలిక ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

The Paradise First Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!
The Paradise First Review: ది ప్యారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..!

సినిమా వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్ర?
సాధారణ సినిమా విమర్శల పరిధిని దాటి కావాలని సినిమా వ్యాపారం, ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ , కామెంట్లు, యూఆర్ఎల్‌లు పనిచేస్తున్నాయని నిర్మాతలు న్యాయస్థానానికి వివరించారు. చిత్ర నిర్మాణం, ప్రచారం, పంపిణీలో కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టామని, విడుదలకు సరిగ్గా ముందు ఇలాంటి నష్టం కలిగించే కంటెంట్ ప్రచారంలో ఉంటే భారీ ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిర్మాతలు వాదించారు.

Conspiracy Against Nani The Paradise Movie Producers Approach Bengaluru Court and issues temporary order

ముందస్తు నోటీసులు లేకుండానే చర్యలకు విజ్ఞప్తి
ఈ దుష్ప్రచారానికి బాధ్యులైన వ్యక్తులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే వెంటనే చర్యలు తీసుకోవాలని నిర్మాతలు న్యాయస్థానాన్ని కోరారు. నోటీసులు ఇస్తే ఆ కంటెంట్‌ను డిలీట్ చేయడం లేదా ఇతర ఖాతాల్లోకి మార్చి మరింత విస్తృతంగా వ్యాప్తి చేసే అవకాశం ఉందని వారు వెల్లడించారు. నిర్మాతల వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఆ కంటెంట్ నిజంగానే సాధారణ విమర్శల పరిధిని దాటి ఆర్థిక నష్టాన్ని కలిగించేలా ఉందనే అభిప్రాయానికి వచ్చింది.

ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. కొన్ని రోజుల గ్యాప్​ తోనే 2 పార్ట్స్ రిలీజ్..!
ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. కొన్ని రోజుల గ్యాప్​ తోనే 2 పార్ట్స్ రిలీజ్..!

తాత్కాలికంగా ఉత్తర్వులు
అయితే ఈ తాత్కాలిక ఉత్తర్వులు కేవలం పిటిషన్ లో పేర్కొన్న కొన్ని నిర్దిష్టమైన పరువు నష్టం కలిగించే యూఆర్ఎల్‌లు, పోస్టులకు మాత్రమే వర్తిస్తాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు లేదా విమర్శకులు ఇచ్చే నిజమైన సమీక్షలపై ఎలాంటి నిషేధం లేదని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులు తాత్కాలికమైనవని, ప్రతివాదులకు కోర్టు సమన్లు పంపిన తర్వాత ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 28న జరగనుంది. సినిమా ప్రచారంలో చివరి దశలో ఉన్న నిర్మాతలకు ఈ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+