స్వర్ణ కుప్పం లక్ష్యం.. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ పై సీఎం చంద్రబాబు ప్రకటన!

ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్నారు. కుప్పం ప్రజలు తనను ఆదరిస్తున్న తీరుకు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

అనంతరం స్వర్ణ కుప్పం బహిరంగ సభలో మాట్లాడారు. కుప్పం ప్రజలతో తనది కుటుంబ అనుబంధమని, ప్రతి ఇంట్లో తనను కుటుంబ సభ్యుడిలా చూస్తారని చెప్పారు.
నారావారిపల్లె తనకు జన్మనిస్తే కుప్పం రాజకీయ జన్మనిచ్చిందని ఆయన అన్నారు. తన మనసుకు అత్యంత దగ్గరగా కుప్పం ప్రజలే ఉంటారని, గత 40ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నందుకు కుప్పం ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తనకు కుప్పంతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

CM Chandrababu sets Swarna Kuppam as goal announced about market yard heritage granite cluster

ఏ పని చేయాలన్నా ముందుగా కుప్పంలోనే ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వసతులు కల్పించడం, ప్రతి కుటుంబానికి ఇల్లు అందించడం ద్వారా 'స్వర్ణ కుప్పం' సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి ద్వారా మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని హామీ ఇచ్చారు. రాయలసీమను ఎడారిగా మారనివ్వొద్దని నీటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.

శ్రీశైలం నుంచి 660 కిలోమీటర్ల దూరం నీళ్లు తీసుకొచ్చి, ఆచరణ సాధ్యం కాదనుకున్నవారిని ఆశ్చర్యపరిచామని చంద్రబాబు చెప్పారు. హెరిటేజ్ గ్రానైట్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుతో పర్యాటకాన్ని ఆకర్షించనున్నామని చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి వద్ద 6 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

 నాగబంధంలో హన్మకొండ సిద్ధేశ్వరాలయం.. రోజూ ఆలయం తెరవగానే అద్భుతం!
నాగబంధంలో హన్మకొండ సిద్ధేశ్వరాలయం.. రోజూ ఆలయం తెరవగానే అద్భుతం!

దీని ద్వారా స్థానిక గ్రానైట్ పరిశ్రమలకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని అన్నారు. రూ.2.5 కోట్ల వ్యయంతో మార్కెట్ యార్డును అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుప్పం ప్రజల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కుప్పం ప్రజలకు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+