'గాడ్స్ ఓన్ కంట్రీ' కి వెళ్తున్నారా..? ఈ టూరిస్ట్ సైట్స్ ను అస్సలు మిస్ కావొద్దు..!

భారత్ లో అనేక టూరిస్టు ప్రాంతాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని ప్రత్యేకమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఏదైనా టూర్ కు వెళ్లాలి.. అనుకుంటే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు కేరళ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి ఎక్కువగా వెళ్లే ప్రాంతం కూడా కేరళనే.. కేరళలో అనేక ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తుంటారు. ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కేరళలో ఈ ప్రాంతాలను తప్పక చూడాల్సిందే. కేరళ టూర్ వెళ్తే కచ్చితంగా ఈ ప్రదేశాలను మిస్ కావొద్దని పలువురు నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నారు.

కేరళ అంటే ప్రకృతి మాత్రమే కాదు.. ఇక్కడి కట్టు బొట్టు.. సంస్కృతి, ఆహారం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కేరళలో మండువా ఇళ్లు అధికంగా కనిపిస్తుంటాయి. ఎప్పుడూ ఈ ప్రాంతంలో వర్షం పడుతూ ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే అనతికాలంగా మండువా ఇళ్లు ఇక్కడ ఉన్నాయి. ఇక కేరళ టూర్ లో ముఖ్యమైనది మున్నార్.. ఇక్కడి పచ్చని టీ తోటలు, కొండలను కప్పేసిన పొగమంచు, చల్లచల్లని వాతావరణం.. ఇలా చెప్పుకుంటూ పోతే మున్నార్ లో చాలా ప్రదేశాలే ఉన్నాయి. మున్నార్ లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది స్వర్గధామం అని చెప్పొచ్చు. అలాగే మున్నార్ లో సన్ రైజ్ అండ్ సన్ సెట్ దృశ్యాలు కూడా అత్యద్భుతంగా ఉంటాయి.

మరో ముఖ్యమైన ప్రాంతం అలప్పుజ.. ఈ పేరు వినగానే చాలామందికి కేరళ బ్యాక్ వాటర్స్ గుర్తుకొస్తాయి. ఎటు చూసిన బ్యాక్ వాటర్స్.. ఒడ్డున పచ్చని కొబ్బరి చెట్లు.. ఇళ్ల మధ్య నుంచి పడవ ప్రయాణాలు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడకు వెళ్తే నగర జీవితానికి దూరంగా ప్రశాంతమైన ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పర్యాటకులకు కలుగుతుందనడంలో సందేహం లేదు. అలాగే వాగమాన్ ప్రాంతం కూడా చాలా ఫేమస్.. ఇక్కడ ఫొటోగ్రఫీకి చాలా ఫేమస్.. పచ్చని మైదానాలు, పైన్‌ అడవులు, కొండలపై నుంచి కనిపించే అందమైన దృశ్యాలు ఇక్కడి ప్రత్యేకత.

Kerala Planning a trip to Take a look at these tourist spots Planning a trip to Kerala tourism

కేరళలోని మున్రో ఐలాండ్.. బెస్ట్ సన్ సెట్, సన్ రైజ్ స్పాట్ గా వర్కల.. అలాగే టెక్కడి, కొచ్చి, అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఇంకా కోవలం బీచ్ లు ప్రధాన టూరిస్టు ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకు రైలు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి కేరళకు రైలు సదుపాయం ఉంది. లేదా సొంత వాహనంలోనైనా బడ్జెట్ లో కేరళ టూర్ ను పూర్తిచేయవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+