ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా..
ఇటీవలికాలంలో చిన్న సినిమాలదే హవా భారీగా నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే..? ఆ సినిమాలపై ఆడియన్స్ విపరీతమైన ఆశలు పెట్టుకోవడం.. దాంతో ఆ అంచనాలను అందుకోలేక చాలా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అవుతున్నాయి. అయితే చిన్న సినిమాలకు అలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తున్నాయి. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ప్రేక్షకులు చూడరని మరోసారి రుజువైంది. అదే 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీతో..
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీస్ కు ఎప్పుడూ ఫ్యాన్స్ ఉంటారు. కొత్త తరహా కథలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ముందుంటారు. కంటెంట్ ఉంటే చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అని చూడకుండా ఆదరిస్తారు. ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీకి కూడా అలాగే జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మానస వారణాసి జోడీగా నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఫిబ్రవరి 14న ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ కు బాగా రీచ్ అయింది. ముఖ్యంగా యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఈ మూవీపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ఏకంగా 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టీమ్ తో ఇంటర్వ్యూ చేసి మరీ ఈ మూవీని ఆకాశానికి ఎత్తారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 13 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మూవీ ఓటీటీలో తెలుగుతోపాటు తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీని తమిళనాడులోని చెన్నై.. ఇతర ప్రాంతాల్లో తీయడం విశేషం.

ఇక 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీలో హీరో తండ్రిగా గోపరాజు రమణ, హీరోయిన్ తండ్రిగా రాజీవ్ కనకాల నటించి మెప్పించారు. ఈ మూవీకి ఆదిత్య రవీంద్రన్ మ్యూజిక్ అందించగా.. యువీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ నిర్మించింది.












Click it and Unblock the Notifications