సైలెంట్ గా వచ్చి భారీ ఓపెనింగ్స్.. ఈ మూవీని మిస్ అవొద్దు..!
కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతుంటాయి.. మరికొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ కొడుతుంటాయి. ఇటీవలి కాలంలో అలా చాలా చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయి. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంబాల చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకుల్ని మెప్పించాయి. అయితే ఈ ఏడాది 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ఆ లిస్టులో చేరినట్లు తెలుస్తోంది. వాలంటైన్స్ డే కానుకగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతోపాటు భారీ ఓపెనింగ్స్ సాధించింది.
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మానస వారణాసి కాంబోలో వచ్చిన యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ 'కపుల్ ఫ్రెండ్లీ' ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి ఈ మూవీ వచ్చింది. అయితే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీగా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. విడుదలకు ముందు ఈ సినిమాకు మేకర్స్ ఎలాంటి హడావిడి చేయలేదు. చాలా సైలెంట్ గా విడుదలైంది. ఇప్పుడు కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి.
మంచి సినిమాకు ప్రొమోషన్స్ అక్కర్లేదు. కంటెంట్ ఉంటే చాలు.. మన తెలుగు ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు అనడానికి ఈ మూవీ ఉదాహరణ అని చెప్పొచ్చు. ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు రెండు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఫస్ట్ షోస్ నుండి ఈ ట్రెండ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చినట్లు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కేవలం రూ. 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే చాలట. పబ్లిక్ మౌత్ టాక్ అదిరిపోవడంతో కచ్చితంగా ఈ సినిమాకు రెండో రోజున మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వస్తాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications