'కొత్త ప్రయాణం స్టార్ట్ అయింది.. ఆశీర్వదించండి'.. యువ జంట పోస్టు వైరల్
కోర్ట్.. స్టేట్ vs ఎ నోబడీ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయింది యువ జంట శ్రీదేవి, రోషన్. తొలి మూవీతోనే తమ యాక్టింగ్ తో మెప్పించింది ఈ జంట. 2025లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మూవీలో వెన్నెల, చందుల కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకుంది. ఈ మూవీలోని తప్పులేదు ప్రేమలో సాంగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది.
అయితే తాజాగా మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీదేవి తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఈ చిత్రాన్ని కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ను ఇన్ స్టా లో పంచుకుంది శ్రీదేవి. ఈ మూవీకి బ్యాండ్ మేళం అని పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను సెప్టెంబర్ 17 ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ప్రకటించనున్నట్లు తెలిపింది. మీ సపోర్ట్ కావాలి అంటూ శ్రీదేవి ఈ పోస్టును పంచుకుంది. దీనిపై నెటిజెన్లు స్పందిస్తూ కంగ్రాట్స్ చెబుతున్నారు. కోర్టు మూవీ మాదిరి మరోసారి మ్యాజిక్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ యువ జంట గామా అవార్డ్స్ ఫంక్షన్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications