ఓటీటీకి లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అవుతున్నాయి. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు రెండో రోజే ఖాళీగా కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాల పరిస్థితి ఇటీవలి కాలంలో ఇలాగే జరుగుతుంది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా నుంచి ఆ ట్రెండ్ కొద్దిగా మారింది.
ఆ సినిమా తర్వాత లెనిన్, మా ఇంటి బంగారం సినిమాలు హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ హీరో సుమంత్ గురించి తెలిసిందే. 1999 లో ప్రేమకథ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సత్యం, గోదావరి సినిమాలతో అలరించారు. ఇటీవల మళ్లీ రావా, సుబ్రహ్మణ్య పురం, సీతా రామం, అనగనగా చిత్రాలతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆయన మహేంద్రగిరి వారాహి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే సుమంత్ ఇటీవల న్యూటన్స్ థర్డ్ లా సినిమా చేశారు. ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఆగస్టు 27 వ తేదీ నుంచి ఈటీవీ విన్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనే స్థాయిలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఈ చిత్రానికి రాజేష్ కర్ణ దర్శకత్వం వహించారు. అలాగే జగపతి బాబు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, నేహా పఠాన్, త్రినాథ్ వర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందించారు. ఇక కే. హరీష్ నిర్మించగా.. ఈటీవీ విన్ సమర్పించింది. ఇక అలాగే సుమంత్ మరికొన్ని థ్రిల్లర్ సినిమాలు కూడా చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications