ఏడేళ్ల తర్వాత తెలుగులో మళ్లీ మూవీకి రెడీ అయిన కల్ట్ డైరెక్టర్...
ప్రేమ కథ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు కరుణాకరన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తెరకెక్కించిన 'తొలిప్రేమ' ఒక కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ గా కూడా నిలిచిపోయారు. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన 'డార్లింగ్'మూవీ కూడా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాలను డైరెక్ట్ చేసిన కరుణాకరన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయించలేకపోయారు.
చివరగా ఆయన సుప్రీం హీరో సాయితేజ్ తో 'తేజ్ ఐ లవ్యూ' మూవీ తెరకెక్కించారు. 2018 లో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోలేదు ఈ డైరెక్టర్. మధ్య మధ్యలో చిన్న హీరోలతో సినిమా చేస్తున్నట్టు టాక్ నడిచినా అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఏడేళ్ల తర్వాత మళ్ళీ ఈయన ఓ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర సీమకు ఎంట్రీ ఇచ్చారు ఆశీష్. రౌడీ బాయ్స్ సినిమాతో సినీ పరిశ్రమలోకి హీరోగా అరంగేట్రం చేశాడు ఆశిష్. ఇటీవలే ఓ ఇంటి వాడైన ఈ హీరో త్వరలోనే కరుణాకరన్ దర్శకత్వంలో నటించబోతున్నట్టు అనుకుంటున్నారు. ఇకపై కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తానని ప్రకటించిన డైరెక్టర్.. ఆ ఆలోచన తోనే ఈసారి కూడా తనకి బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
అయితే ఆశిష్ కథ విని ఓకే చెప్పాడని.. దిల్ రాజు స్టోరీ ఓకే చేయాల్సి ఉందని సమాచారం. ఒకవేళ దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు ఏడేళ్ల తర్వాత మరో తెలుగు సినిమా తీసినట్లు అవుతుందని భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి జంటగా ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'తొలి ప్రేమ'. పవన్ కళ్యాణ్ కెరీర్ లో 4వ సినిమాగా వచ్చి ఆయనకు సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది. 1998 జులై 24న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. రీసెంట్ గా ఈ మూవీ రీ రిలీజ్ చేసినప్పుడు కూడా అదిరిపోయే రెస్పాన్స్ సంపాదించుకుంది.












Click it and Unblock the Notifications