జైలు నుంచి బయటికి వచ్చాక తొలిసారి పోస్ట్ పెట్టిన దర్శన్.. ఏంటంటే ?
కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ కేసులోనే అరెస్ట్ అయిన ఆయన కొన్ని నెలలు జైలు జీవితం గడిపి గత డిసెంబర్ నెలలో బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే జైలుకి వెళ్లొచ్చిన తర్వాత మొదటిసారి దర్శన్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు ఒక రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు ఆ పోస్టులో.. కష్ట సమయాల్లో మీ ప్రేమ నాలో ధైర్యాన్ని నింపింది. వ్యక్తిగతంగా మీ అందరినీ కలవాలని, కృతజ్ఞత తెలపాలని ఉంది అని రాసుకొచ్చారు.
అయితే తీవ్ర వెన్నునొప్పి, అనారోగ్య సమస్యల వల్ల ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అంటూ విజ్ఞప్తి చేశారు.క్లిష్ట సమయంలో సపోర్ట్‌గా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు దర్శన్. అలానే త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని.. అందరినీ కలుస్తానని దర్శన్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, నటి పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసులోనే అరెస్టైన దర్శన్ కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు. తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నా అంటూ బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టును కోరడంతో బెయిల్ మంజూరు చేసింది.
ఇక జైలు నుంచి దర్శన్ రిలీజ్ అయిన దగ్గరి నుంచి వెన్ను నొప్పికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొనడం లేదని సమాచారం. ఆరోగ్యం కుడుటపడిన తర్వాత దర్శన్ తిరిగి సినిమా షూట్స్‌లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications