ఓటీటీలోకి 100 కోట్ల బ్లాక్ బస్టర్ మూవీ.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో లోకేశ్ కనగరాజ్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా బ్లాక్ బస్టర్ సక్సెస్ రేట్ తో ఇండస్ట్రీలో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారాయన. 2016 లో అవియల్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. 2017 మానగరం సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక 2019 లో ఖైది మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నారు లోకేశ్ కనగరాజ్. ఆ తర్వాత 2021 లో మాస్టర్, 2022 లో విక్రమ్, 2023 లో లియో, 2025 లో కూలీ తదితర చిత్రాలతో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు. అయితే ప్రతి దర్శకుడిలో ఓ నటుడు ఉంటాడన్న సంగతి తెలిసిందే. నటీనటులకు ఆయన నటించి చూపించాకే వాళ్లు అలా ఎక్స్ ప్రెషన్స్ పెడుతుంటారు. ప్రతి దర్శకుడిలో అలా ఓ నటుడు ఉంటాడు. అందుకే చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో అలా కొద్దిసేపు కనిపించి వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు.
అయితే లోకేశ్ కనగరాజ్ మాత్రం అలా కొద్దిసేపు కాదు ఆయనే హీరోగా ఏకంగా సినిమానే తీశారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం ఆయన చేయలేదు. అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అదే డీసీ మూవీ. ఆగస్టు 7 న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రూ. 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీలో లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. అయితే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది. సన్ నెక్స్ట్ వేదికగా సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

అంతేకాదు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఇదే సమయంలో సినిమా ప్రీమియర్ అయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే రెండు ప్లాట్ ఫామ్ లపై ఒకేసారి స్ట్రీమింగ్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డీసీ మూవీకి అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. లోకేశ్ కనగరాజ్ సరసన వామికా గబ్బి హీరోయిన్ గా నటించారు. అలాగే సంజయ్ కృష్ణమూర్తి, అవినాష్ రఘుదేవన్, గురు సోమసుందరం తదితరులు కీలకపాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. మరోవైపు లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications