ఆనందం పట్టలేక.. డీసీ హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కు కాస్ట్లీ బీఎండబ్ల్యూ కార్లు గిఫ్ట్ ఇచ్చిన సన్ పిక్

ఫిల్మ్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన మూవీ.. డీసీ. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 25 కోట్ల రూపాయల లిమిటెడ్ బడ్జెట్‌తో తెరకెక్కిన తమిళ సినిమా ఇది. థియేటర్లలోకి వచ్చిన కొన్ని వారాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను రాబ్టటింది. నిర్మాతపై కాసుల వర్షాన్ని కురిపించింది. పెట్టిన ఖర్చుకు నాలుగు రెట్లకు పైగా టేబుల్ ప్రాఫిట్ ను తెచ్చిపెట్టిందీ మాస్ ఎంటర్టైనర్.

ఈ చిత్రం సాధించిన అద్భుత విజయాన్ని పురస్కరించుకుని సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్ యూనిట్ కు ఊహించని రీతిలో అత్యంత ఖరీదైన బహుమతులను అందజేశారు. సినిమా ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, విలక్షణ నటనతో ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో కట్టిపడేసిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌కు బ్రాండ్ న్యూ లగ్జరీ బీఎండబ్ల్యూ కార్లను కానుకగా ఇచ్చారు.

DC Producer Kalanithi Maran Gifts New BMW Cars to Arun Matheswaran Lokesh Kanagaraj and Anirudh

వీరికి కార్ కీస్ అందజేస్తున్న ఫొటోలు, వీడియోలను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్ట్ చేసింది. ఆ వెంటనే అవి వైరల్‌ అయ్యాయి. భారీ అంచనాల మధ్య ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కోలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా కొనసాగుతున్న లోకేష్ కనగరాజ్‌కు నటుడిగా ఇది మొదటి సినిమా కావడం ఒక విశేషమైతే.. ఆయన పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం మరో విశేషం.

నాగ చైతన్య అడ్వెంచర్ థ్రిల్లర్ విడుదల తేదీ వెల్లడి- ఒకే నెలలో.. !!
నాగ చైతన్య అడ్వెంచర్ థ్రిల్లర్ విడుదల తేదీ వెల్లడి- ఒకే నెలలో.. !!

దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ పాత సినిమాలతో పోలిస్తే ఇందులో కథను నడిపించిన తీరు, అనిరుధ్ అందించిన మ్యూజిక్.. ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమాలో చంద్ర పాత్రలో అసాధారణ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి వామికా గబ్బికి మాత్రం గిఫ్ట్ ఇవ్వలేదు కళానిధి మారన్. దీనిపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. బీఎండబ్ల్యూ కార్లు అందుకున్న వారితో సమానంగా వామికాకు కూడా సినిమా విజయంలో క్రెడిట్ దక్కాలని కోరుతున్నారు.

డీసీ సెకెండాఫ్ ను తన అద్భుత నటనతో ఒంటిచేత్తో నడిపించిందని వామికాను ప్రశంసిస్తోన్నారు. లోకేష్ కనగరాజ్ సరసన చంద్ర పాత్రలో వామికా గబ్బి కనబరిచిన అసాధారణ నటన సినిమాకు ప్రాణంగా నిలిచిందని చెబుతున్నారు. ఇందులో మరో నటి సంజన కృష్ణమూర్తి.. పార్వతి పాత్రలో మెప్పించింది. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా వామికా పాత్రకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+