దీపికా పదుకొణె డిమాండ్‌లో తప్పేముంది?

Deepika Padukone: సినిమా షూటింగ్ సెట్స్‌లో పని గంటలపై మరోసారి చర్చ మొదలైంది. రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయాలన్న దీపికా పదుకొణె (Deepika Padukone) డిమాండ్ అప్పట్లో బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు పిల్లలకు తల్లైన నటి ఇషితా దత్తా ఈ అంశంపై స్పందిస్తూ దీపికకు మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్‌ వంటి ప్రాజెక్టుల నుంచి బయటకు రావడం చర్చనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పని గంటలు, షూటింగ్ షెడ్యూల్స్‌పై పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఈ అంశంపై 'దృశ్యం 3: ది కంక్లూజన్' నటి ఇషితా దత్తా (Ishita Dutta) స్పందిస్తూ దీపికకు మద్దతుగా నిలిచారు.

Ranabaali First Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Ranabaali First Review: విజయ్ దేవరకొండ 'రణబాలి' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషితా మాట్లాడుతూ.. ఒక నటుడు లేదా నటి రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమన్నారు. కొందరు 12 నుంచి 15 గంటల పాటు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మరికొందరు తమ వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా 8 గంటల షిఫ్ట్‌ను కోరుకోవచ్చని చెప్పారు. ఇందులో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. 8 గంటల పని షెడ్యూల్‌ను అంగీకరించాలా వద్దా అనేది నిర్మాణ సంస్థల నిర్ణయమేనని ఇషితా స్పష్టం చేశారు.

Deepika Padukone 8-Hour Shift Demand Gets Support From Ishita Dutta

సినిమా అవసరాలు, బడ్జెట్, షూటింగ్ ప్రణాళికలను బట్టి నిర్మాతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే ఒక నటుడు లేదా నటి ఇలాంటి షెడ్యూల్‌ను కోరడాన్నే తప్పుగా షూటింగ్ మాత్రం సరికాదని చెప్పారు. డిమాండ్‌ను తిరస్కరించే హక్కు నిర్మాణ సంస్థకు ఉన్నప్పటికీ, దాన్ని కోరినందుకు నటీనటులను విమర్శించడం సమంజసం కాదని ఆమె పేర్కొన్నారు.

ప్రభాస్ 'కల్కి 2' లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. ఆ రోజే సెట్స్ లోకి ఎంట్రీ..!
ప్రభాస్ 'కల్కి 2' లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. ఆ రోజే సెట్స్ లోకి ఎంట్రీ..!

పిల్లలు ఉంటేనే ఆ కష్టం తెలుస్తోంది
ఇద్దరు పిల్లలకు తల్లైన ఇషితా దత్తా.. పని, కుటుంబ బాధ్యతల మధ్య సమతుల్యత గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత కెరీర్, కుటుంబాన్ని ఒకేసారి చూసుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు మరింత స్పష్టంగా తెలుస్తాయని అన్నారు. తల్లి అయిన తర్వాత షూటింగ్ షెడ్యూల్‌ను వ్యక్తిగత జీవితంతో సమన్వయం చేసుకోవడం తనకు సవాలుగా మారిందని అన్నారు.

గంటకు 60 వేల టికెట్లు తెగుతున్నాయ్.. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ విధ్వంసం..
గంటకు 60 వేల టికెట్లు తెగుతున్నాయ్.. 75 ఏళ్ల వయసులో రజనీకాంత్ విధ్వంసం..

గతంలో తాను కూడా ఎక్కువ గంటల పాటు షూటింగ్‌లలో పాల్గొన్నానని ఇషితా చెప్పారు. అయితే తల్లి అయిన తర్వాత తన పరిస్థితిని మేకర్స్ అర్థం చేసుకుని కొన్ని సందర్భాల్లో ముందుగానే సెట్ నుంచి వెళ్లేందుకు సహకరించారని తెలిపారు. నటీనటుల వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్‌లో కొంత వెసులుబాటు ఉండటం అవసరమని ఆమె అభిప్రాయం.

Jailer 2 Twitter Review: రజినీకాంత్ 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ..
Jailer 2 Twitter Review: రజినీకాంత్ 'జైలర్ 2' ట్విట్టర్ రివ్యూ..

దీపికా డిమాండ్‌పై చర్చ
దీపికా పదుకొణె 8 గంటల షిఫ్ట్ కోరినట్లు గతంలో వార్తలు వచ్చాయి. స్పిరిట్, కల్కి 2898 AD సీక్వెల్‌ వంటి ప్రాజెక్టుల నుంచి ఆమెను దొలగించారని, అందుకు ప్రధాన కారణం పని గంటలు, ఇతర వృత్తిపరమైన అంశాలతో ముడిపెడుతూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడానికి కేవలం 8 గంటల షిఫ్ట్ డిమాండే కారణమని అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ విషయంపై పలువురు నటులు ఆమెకు సపోర్టుగా నిలిచారు. ప్రస్తుతం దృశ్యం 3 నటి ఇషితా దత్తా మద్దతుగా నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+