'మన శంకర వరప్రసాద్ గారు' కథ ఆ హీరో కోసం రాసుకున్నదా..?

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. జనవరి 11 ఆదివారం రాత్రి ప్రీమియర్స్ తోనే థియేటర్ల వద్ద మెగా సందడి మొదలైంది. అనిల్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. బుక్ మై షో యాప్ లో గంటకు 20 వేల టికెట్స్ సేల్ అవుతున్నాయి. దాంతో బాక్సాఫీస్ వద్ద మెగా సునామీ మొదలైనట్టే కనిపిస్తోంది.

ఇక అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ ఏడాది మెగాస్టార్ అదే రేంజ్ హిట్ కొట్టబోతున్నాడు. అయితే 'మన శంకర వర ప్రసాద్ గారు' కథకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కథను అనిల్ రావిపూడి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రాసుకున్నాడట. అయితే చిరంజీవితో సినిమా సెట్ అవ్వడంతో రజినీకాంత్ కోసం అనుకున్న కథలోనే చాలా వరకు మార్పులు చేర్పులు చేసి చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా కథను మలిచినట్లు సమాచారం.

Did Chiranjeevi Write the Shankar Varaprasad Story Just for Himself The Truth Behind MSG

ఇక ఇప్పటికే వెంకటేశ్ కు ఎఫ్ 2, ఎఫ్ 3, బాలకృష్ణకు భగవంత్ కేసరి, రవితేజకు రాజా ది గ్రేట్ చిత్రాలతో హిట్స్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సూపర్ హిట్ అందించాడు. ఇక ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార నటించారు. విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెప్పించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+